(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)
శుక్రవారం 18 సెప్టెంబర్ 2009
వెయ్యి కోట్ల డీల్సూ... మర్డర్ల మాటలు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)
గురువారం 17 సెప్టెంబర్ 2009
మంత్రదండం బయటకి తీసి ఖజానాని నింపి వెయ్యవయ్యా....
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)
బుధవారం 16 సెప్టెంబర్ 2009
ఆత్మవిశ్వాసం
నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో
అసాధ్యమన్నదే లేదు ఆత్మవిశ్వాసం నీకుంటే
అపజయమే దరికి రాదు ఆత్మస్థైర్యం నీకుంటే
గుండె బలముంటే గెలుపన్నది నీ ఇంటి గడపే
నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో
నిరాశతో కుంగిపోకు నీ శక్తే నీకు బలం
ఓటమికి వెరవొద్దు అదే నీ గెలుపుకి తొలి మెట్టు
నొప్పికి వెరవకుంటే ముళ్ళు కూడా పువ్వులే
నిన్ను నీవు నమ్ము కుంటే ప్రతి పనిలో విజయాలే
నాకంటూ ఓ రోజు వస్తుందని కూర్చుంటే
కాలం కరుగుతుంది కాని నీకా రోజు రాదులే
ఈ రొజునే నీ రోజుగా చేసుకో
ప్రతి క్షణం విజయం నీదని తెలుసుకో
నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో
సలహాలకేముంది ఎవరైనా ఇస్తారు
సాయం చేయ రమ్మంటే వారంతా పరారు
దేవుడేమి చేస్తాడు నీ ప్రయత్నం లేకుండా
నీ శ్రమ తోడైతే ఆ దేవుడే నీకు జోడు
నీ ఖర్మకు నీవు కాక ఎవరు బాధ్యుడు
నీ లక్ష్య ఛేదనకు ఆత్మ బలమే ఆయుధం
నీ కలల సాధనకు ఆత్మ విశ్వాసమే అస్త్రం
నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో
మంగళవారం 15 సెప్టెంబర్ 2009
వీరాధి వీరుడా స్టారాధి స్టారుడా.... డిపాజిట్ ఏదయ్యా?
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)
సోమవారం 14 సెప్టెంబర్ 2009
కాంగ్రెస్ దేవుడు వై.ఎస్ పాలన అంత బాగుంటే...
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)
శుక్రవారం 11 సెప్టెంబర్ 2009
మన పాలక పార్టీ పేరు కాంగ్రెస్సా లేక కాంగ్రెస్ (ఐ) నా ?
స్నేహితుడు
గురువారం 10 సెప్టెంబర్ 2009
సోనియా జీ..... మాకున్న అర్హత 30 ఏళ్ల నెహ్రూ కుటుంబ విధేయత & ఓ కర పత్రిక
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)
అశ్రువు

కను రెప్పల మాటున
బుధవారం 9 సెప్టెంబర్ 2009
జ్వలనం

మంగళవారం 8 సెప్టెంబర్ 2009
కలల లోగిలి
సోమవారం 7 సెప్టెంబర్ 2009
శాంభవి.... టిబెట్ స్వేచ్ఛా ప్రధాత?
కోటప్ప కొండకు దైవ దర్శనానికి వెళ్ళిన శాంభవి అనే బాలికను అదే పనిగా ఈ రోజు అంతా TV9 లో చూపిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఆ పాప గురించి కొన్ని వార్తలు చదివాను కానీ ప్రత్యక్షం గా తన మాటలు విన్నది మాత్రం ఈ రోజే.
ఆ చిన్ని పాపని చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. తను వల్లె వేస్తున్న మాటలు అంత కన్నా ముద్దు ముద్దు గా ఉన్నాయి.
కానీ ఆ మాటల్లో సత్యాసత్యాల సంగతేమిటో నాకైతే అంతుబట్టటం లేదు.
నిజానికి ఆ పాపలో అద్భుత గ్రాహక శక్తి ఉండి ఉండాలి.దానిని ఎవరైనా స్వార్ధ పరులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. తను చెప్పే విషయాల్లో ఏదీ నమ్మశక్యం గా లేవు.
తను దలైలామా పూర్వ జన్మలో స్నేహితులట. ఇద్దరూ కలసి గౌతమ బుద్ధుని వద్ద శిష్యులు గా ఉండే వారట. టిబెట్ కి ఇంకొక 3 సంవత్సరాలలో (2012)స్వాతంత్ర్యం ఇప్పించటానికే తాను జన్మించిందట. వీర బ్రహ్మేంద్ర స్వామి వీర భోగ వసంత రాయలు గా 2012 లో జన్మిస్తారట. మంచి వాళ్ళని రక్షించి పిచ్చి వాళ్ళని (చెడ్డ వాళ్ళని కాదు) సంహరిస్తాడట. 2012 లో మంచి భూమి మిగిలి చెడ్డ భూమి నాశనం అవుతుందట. (భూమి లో మంచీ చెడ్డా నాకు అర్ధం కాలేదు).
భారత దేశం బాగానే ఉంటుందట కానీ చైనా, పాకిస్తాన్ & అమెరికా దేశాలు నాశనమైపోతాయట. (బహుశా చెడ్డ భూమి అంటే మనదేశానికి శతృదేశాలేమో అనిపించిది తను చెప్పిన ఈ మాటలు విన్నాక)...
ఇవన్నీ విన్నాక నాకు కొన్ని సంగతులు అర్ధం కాలేదు.
2012 లో సునామీ లు, భూకంపాలు వచ్చి చైనా నేలమట్టమై పోతే ఇక ప్రత్యేకం గా టిబెట్ కి స్వాతంత్ర్యం ఇప్పించటానికి తాను జన్మించవలసిన అవసరం ఏమిటి.
చైనా, పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలు సునామీ లు, భూకంపాలు వచ్చి నాశనం అయిపొతే వీరభోగ వసంతరాయలు వచ్చి ఏం చేస్తారు?
ఆ మధ్య ఓ జులపాల స్వామి వారు తమ ముఖార విందాన్ని రాత్రికి చందమామలో దర్శించమని తరువాత తూఛ్... తూఛ్.... ఇప్పుడే కాదు అన్నట్లు, కొన్నాళ్ళాగాక బహుశా 2012 లో) ఈ పాప చేత కూడా నాకు దేవుడి నుండి సందేశం వచ్చింది ఇంకా పాపం పూర్తిగా పండలేదు అందుకే ఇంకా టిబెట్ కి స్వేచ్ఛ రాలేదు అనిపించరంటారా?
ఇలా అంటున్నానని నేనేం నాస్తికుణ్ని కాదు. కానీ దేవుడి పేరు చెప్పి చిన్న పిల్ల చేత ఇలా చెప్పిస్తున్నారేమో అని బాధ గా మాత్రం ఉంది.
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)