
ప్రియా...
తనను తాను మర్చిపోవటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఏ కొద్ది మందికో తప్ప.
ఆ కొద్దిమందిలో నేనూ ఒకడిని అయినందుకు గర్వపడాలో... ఆ అనుభూతిని నాకు పంచిన నువ్వు దూరమైనందుకు బాధ పడాలో అర్థం కాక నా మనసు విల విల లాడుతుంది.
నిజం ప్రియా...
నీ సన్నిధిలో నేను గడపిన ప్రతీక్షణం నన్ను నేను మరచిపోయాను. నా కంటూ ఓ మనసు, ఓ ప్రాణం, ఓ శరీరం ఉందని నేను మరచిపోఎంత మధురానుభూతులు నీ సాన్నిహిత్యం లో నాకు లభించాయి. నాకు సంబంధించినంత వరకూ ఆ మధురనుభూతులన్నీ అవ్యక్తానుభూతులే.
ఆ అనుభూతులన్నీ భవిష్యత్తులో జ్ఞాపకాలుగా మారిపోతాయని ఏనాడూ నేను అనుకోలేదు.
ఈనాడేమో... ఒకనాటి నిజాలన్నీ నేడు జ్ఞాపకాలే అని తలచుకుని ఆ జ్ఞాపకాలే ఊపిరిగా మార్చుకుని బతుకుతున్నాను.
నువ్వు నాకు మాత్రమే జ్ఞాపకమని... మరో చోట నువ్వు నిత్య నూతన సౌభాగ్యానివి అని నా మనసుకి సర్ది చెప్పి ఊరడిస్తున్నాను.
కానీ అదేమీ బండరాయి కాదు కదా నా ఊరడింపులు వినటానికి.
పది వసంతాలు నీ ధ్యానమే ప్రాణం గా నీ రూపమే జీవం గా నీ తలపులే ఊపిరిగా నీ ఊహలే ఆశలుగా మార్చుకుని ఉన్న ప్రేమ పూరితమైన మనస్స్సు అది. అందుకే నామాటలు దానిని సంతృప్తి పరచలేకపోయాయి.
" ఓసి పిరికి మనస్సా... ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనం? తన సాన్నిహిత్యం గతం లోకి జారక మునుపే ధైర్యం చెయ్యాలి. ధైర్యం లేకుండా ఏదైనా ఎలా సిద్ధిస్తుంది. ?" అని నేను నా మంసస్సుని దెప్పి పొడిచాను.
"ఓ అసమర్ధ ప్రేమికుడా.. నాకు ధైర్యం లేక కాదయ్యా... నీ ప్రియురాలి సాన్నిహిత్యం దూరం అవుతుందేమో అని నీవే ఆవిషయం బయట పెట్టవద్దు అన్నావు. ఇప్పుడు నువ్వు చింతిస్తూ నన్ను బాధపెడతావెందుకు?" అని నన్నే మందలించింది.
నిజమే ఇప్పుడు బాధ పడి ఏమి ప్రయోజనం... నీ హితం కోరుకోవటం తప్ప....
నీ...
హితుడు... స్నేహితుడు.






3 వ్యాఖ్యలు:
సున్నితంగా మనసుని తాకుతుంది మీ లేఖ!
heart touching:)
heart touching:)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి