
ఓ పసితనం మాడిన వేళ, ఓ పితృ హృదయం ఆగిన వేళ యావత్ ప్రపంచం దృష్టీ అక్కడే ఉంది. కసాయి వెధవలు కిరాయి కోసం చేసిన ఘాతుకాన్ని అందరూ ఖండించటం నిజం గా హర్షణీయం.
కానీ వీళ్ళ కుటుంబ వ్యవహారాలతో ఏ సంబంధం లేని ఓ పేద డ్రైవర్ హత్య మాత్రం ఏ ఒక్కరి కంటికీ ఆనక పోవటం (ప్రధాన మీడియా తో సహా) అంటే బాధాకరం. నా వరకూ నాకు ఎవరి హత్య అయినా ఒక్కటే. కారు డ్రైవర్ లక్ష్మణ రావు, చిన్నారి తల్లి వైష్ణవి ల హత్యలతో ప్రత్యక్షం గా, వైష్ణవి తండ్రి ప్రభాకర్ చావుకి పరోక్షం గా సంబంధం ఉన్న నరరూపరాక్షసులు అందరినీ బహిరంగంగా ఒక్కొక్క అవయవాన్ని రంపాలతో కోసి చంపాలి.
కిడ్నాప్ కి గురైన రోజున (చనిపోయిన వార్త తెలిసేంత వరకూ) నాగ వైష్ణవి పేరు గానీ, ఆమె తండ్రి ప్రభాకర్ పేరు గానీ తెలియని వారే లేరు. కానీ తనకు సంబంధం లేని గొడవల్లో తొలి సమిధగా మారిన కారు డ్రైవర్ లక్ష్మణ రావు పేరు ఎంత మందికి తెలుసు. చావుకి పేదైనా గొప్ప అయినా ఒక్కటే. ఓ పేద కుటుంబం లో సంపాదించే వ్యక్తి పోతే ఆ కుటుంబానికి ఆలంబనే ఉండదు. తన కోసం మనమేమీ చెయ్యలేకపోయినా అశ్రువొక్కటి ధారపోద్దాం.
ఓ లక్ష్మణ రావు గారూ, అందుకోండి మీ ఆత్మ శాంతి కోసం నా అశ్రు నివాళి.
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)






2 వ్యాఖ్యలు:
లక్ష్మణ రావు గారి, ఆత్మశాంతి కోసం నా అశ్రునివాలి.
ఇదే విషయం నేను నిన్నటి నుండి అనుకుంటున్నాను, ఇంతమంది జనం చిన్నపిల్లని చంపేసారు, తండ్రి చనిపోయాడు, అన్న దానికే స్పందిస్తున్నారు కాని వారితో పాటు ఇంకో మనిషి కూడా దారుణంగా హత్య కావించబడితే అంత భాధని వ్యక్తం చేయట్లేదు, ఎందుకని పేదవాడి ప్రాణాలకి విలువలేదా అని ఇప్పటికి మీరు రాసారు, ఇది నిజమైన మానవత మీతో పాటు నేను అతని ఆత్మ శాంతికి నివాళి అతని కుటుంబానికి ప్రగాఢ సానుబూతి తెలియపరుస్తున్నాను.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి