ఆదివారం 14 ఫిబ్రవరి 2010

నీ స్నేహం


నవ్వుల చినుకుల్లో తడిమేసే తడి తపనల్లో

నిట్టూర్పుల తాకిడిలో

త్రుళ్ళిపడే సంకీర్తనల్లో

తొలకరి తరువాత అలరించే ఇంద్రధనస్సుల్లో

నడిసంద్రంలో భయపెట్టే నిశ్శబ్దంలో

నిన్నటి అల్లరుల పరవశాల్లో

నేటి అనుభవాల ఆలోచనల్లో

కంటిపాపని కాపాడే కనురెప్పై

కారుచీకట్లలో మెరిసే సౌదామినియై

అనుక్షణం నీవెంటే నేనున్నానంటూ తోడుండే నీడలా

సైన్యం, ధైర్యం, స్థైర్యం, సర్వం అన్నీ తానే అనిపించేది నీ స్నేహం

1 వ్యాఖ్యలు:

అక్షర మోహనం చెప్పారు...

It is nice.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి