శనివారం 9 జనవరి 2010
దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు
అక్టోబర్: కనీ వినీ ఎరుగని వరదలు
నవంబర్ & డిసెంబర్: జై తెలంగాణ.. జై జై సమైఖ్యాంధ్ర.....
జనవరి: మీడియా పైత్యం & యుద్ధం
ఫిబ్రవరి: ???????
పాపం రోశయ్య దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అనుకుంటా.... (ఏ టెన్షన్స్ వద్దనుకుని ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా కౌన్సిల్ కి వెళ్లి మంత్రి నుండి ముఖ్యమంత్రి కి ప్రమోషన్ సంపాదించుకున్న ఆనందం, మనస్ఫూర్తిగా ఒక రోజన్నాఅనుభవించాడో లేదో పాపం!)
మీ
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)
శుక్రవారం 8 జనవరి 2010
హలో... బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త ...
కానీ బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త....
మీరు రాసే మీ ఊహాజనిత కధనాలు ఏ ఛానల్ వాడికో తెగ నచ్చేసి వాటిమీద ఏ వెర్రి వెంగళప్ప తో నో చర్చ పెట్టేసి ఓ మూడు నాలుగు గంటల పాటు చర్చ పెట్టేసినా పెట్టేస్తారు పలానా బ్లాగ్ లో ఇలా అంటున్నారు అని. ఇలాంటి కధనాల కోసమే కాసుక్కూచ్చునే బాచ్ తెగులునాట ఏ మూల కెళ్ళినా రెడీ గా ఉంటారని ప్రత్యేకం గా మళ్ళీ చెప్పాలా నిన్న రాత్రి జరిగిన దాన్ని చూసాక.
బ్లాగ్ పాపులారిటీ ఏమో గాని ఆనక పోలీసు కేసులూ గట్రా మన నెత్తి మీదే. ఆ రష్యా వాడైతే మన వాళ్లకి వెంటనే దొరక్క పోవచ్చు కానీ మనమైతే వీళ్ళ చేతులకి చిక్కటం క్షణాల్లో పని.
ఇక నుండి ఇలా జరిగి ఉండవచ్చు అలా జరిగి ఉండవచ్చు అని మనం చెప్పాలన్నా మీడియా దెబ్బ కి మన జాగ్రత్త లో మనం ఉండాలి. కాబట్ట్టి బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త.....
మీ
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)
గురువారం 7 జనవరి 2010
మనం మనుషులమా గొర్రెల మందల్లో గొర్రెలమా?
దాదాపు గత రెండు నెలలు గా మన రాష్త్రం లో జరుగుతున్న పరిణామాలు, వాటి పై కొంతమంది జనం స్పందిస్తున్న తీరు చూస్తుంటే పై అనుమానం రాక మానటం లేదు.
ఏమిటీ గత కొంత కాలం గా మనకీ మంట?.
తెలుగుజాతి కి ఏదో పీడ పట్టినట్లు మనలో మనమే కొట్టుకోవడం.
పాకిస్తాన్ ఇండియా సైనికుల్లా , కాలికి కత్తి కట్టిన పందెం కోళ్ళలాగా రెండువర్గాలు గా మనం విడిపోయి కొట్టుకొంటుంటే ఏదో రిఫరీ లా ఆ అరవ చిదంబరం గారు ఉన్నట్లు ఉన్నారు.
జై తెలంగాణా అన్న నాయకుల సంబంధీకులు కానీ, జై సమైఖ్యాంధ్ర అనే నాయకుల బంధుగణం లో కానీ ఎవరైనా ఆత్మాహుతి చేసుకున్నారా. సామాన్య జనం తప్ప. వాళ్ళు జై అని మాత్రమే అంటారు తమ రాజకీయ పునాదులు ఆ నినాదాల్లో తవ్వులుని ఉంటారు కాబట్టి. కానీ మనం మాత్రం గొర్రెల మందల్లా జై జై అంటూ ఆత్మార్పణం చేసుకుంటూ ఉంటాం. ఆ ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తుల కుటుంబాలు పడే క్షోభని ఈ రాజకీయ నాయకులు, విద్యాలయాల్లో చదువులు చెప్పటం మాని ఉద్యమాలు ఎలా చెయ్యాలో చెప్పే అధ్యాపకులు తీర్చగలరా?
మన ఆస్తులు మనమే నాశనం చేసుకుని మనం బాపుకున్నదేమిటి. బస్సు చార్జీల మోత తప్ప. రవాణా చార్జీల పెంపు ఒక్కటి చాలు మనలాంటి సామాన్యుల జీవితాలని అస్తవ్యస్తం చెయ్యటానికి. ఎందుకంటే మనం ఉపయోగించే ప్రతి వస్తువు ఖరీదులోనూ రవాణ చార్జీ మిళితం అయి ఉంటుంది కాబట్టి.
ఈ రోజున ప్రభుత్వాన్ని మనం గట్టిగా నిలదీయగలిగే నైతికత మనలో ఉందా.? ప్రభుత్వ ఆస్తి అంతే పౌరుల ఆస్తే కదా. మన ఆస్తి మనమే నాశనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏమని అడగగలం.
ఉద్యమాల ముసుగులో అరాచక శక్తులకు ఊతం ఇవ్వడం తప్ప ఇంతవరకూ ఎవరికి అయినా ఒరిగింది ఏమిటి.? గొర్రెల మందల్లో గొర్రెల్లా ముందున్న వాడిని అనుసరించి మన జీవితాలని నాశనం చేసుకోవటం తప్ప?
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)





