
శనివారం 4 సెప్టెంబర్ 2010
నాయకుల అనారోగ్యాలకూ ప్రజావసరాలు బలి అవ్వాలా?

శుక్రవారం 3 సెప్టెంబర్ 2010
శ్రీధర్ కార్టూన్ లో తప్పేంటి?
ఈ రోజు ఈనాడు లో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మీద కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ కొంతమందికి అభ్యంతర కరం గా అనిపించిందట. ఆ కార్టూన్ ఒక వయోవృద్ధుడి అనారోగ్యం మీద వేసిన కార్టూన్ అని వారి భావన.
రోశయ్య గారు వయో వృద్దులు మాత్రమే అయి ఉంటే శ్రీధర్ ఆ కార్టూన్ వేస్తే అభ్యంతరకరం ఏమో కానీ రాష్ట్రాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి తరచూ అనారోగ్యం బారిన పడుతున్నప్పుడు ఆ కార్టూన్ లో అభ్యంతరం ఏముంది.
అది ముఖ్యమంత్రి అనారోగ్యం మీద వేసిన కార్టూన్ గా మాత్రమే నాకు అర్ధం అయ్యింది కానీ ఒక వృద్ధుడిని అపహాస్యం చేసిన కుసంస్కారం అందులో నాకు కనిపించలేదు.
దశాబ్దాల తరువాత ఒక మంచి ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, తమ పార్టీమహా నాయకుడు గతించి ఏడాది గతించిన సందర్భం గా అంజలి ఘటించటానికి సహకరించని ఆరోగ్యం మన ముఖ్యమంత్రి ది. పెద్ద వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవటం చాలా అవసరమే కానీ అది అనుక్షణం ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పదవుల్లో కూర్చోబెట్టి మాత్రం కాదు.
మామూలు ఉద్యోగులు 58/60 సంవత్సరాల వయసు దాటితే ప్రభుత్వానికి పనికి రారు కానీ 75/80 సంవత్సరాలు దాటిన, నిలబడితే కూర్చోలేని, కూర్చుంటే నిలబడలేని వృద్ధ నాయకులు మాత్రం బాగా పనిచెయ్యగలరట.రాజకీయ నాయకులకు వాళ్ళు చనిపోయినప్పుడు కానీ రిటైర్మెంట్ రాదు.





