Friday, 11 September 2009

మన పాలక పార్టీ పేరు కాంగ్రెస్సా లేక కాంగ్రెస్ (ఐ) నా ?


ఇప్పుడు మన రాష్ట్రం లో & దేశం లో పరిపాలన సాగిస్తున్న పార్టీ కాంగ్రెస్సా లేక ఇందిరా కాంగ్రెస్సా (కాంగ్రెస్ (ఐ)).

ఎందుకంటే, ప్రస్తుతం 125 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకుంటున్న ప్రస్తుత కాంగ్రెస్ నా చిన్నప్పుడు ఎక్కడ చూసినా కాంగ్రెస్ (ఐ) అనే పిలవబడేది. దానితో పాటు ఇంకా కాంగ్రెస్ (జే) & కాంగ్రెస్ (ఎస్) అని కూడా ఉండేవి.

కానీ ప్రస్తుతం కాంగ్రెస్ (ఐ) అనే పదమే వినపడటం లేదు.

కాంగ్రెస్ (ఐ) మళ్ళీ కాంగ్రెస్ గా మారిపోయిందా? మారితే ఎప్పుడు మారింది?

ఎవరికైనా తెలిస్తే చెప్ప గలరు.



మీ
స్నేహితుడు

4 comments:

E raayi aitEnenTi tala boppi kaTTaTTAniki ?

ఏ రాయి ఐతేనెంటి తల బొప్పి కట్టట్టానికి ?

అధికారికంగా - ఆ పార్టీ పేరు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఇండియన్ నేషనల్ కాంగ్రెసే. కాంగ్రెస్(ఐ) అనేది రకరకాల కాంగ్రెస్‌ల మధ్య ఇందిరాగాంధీ ఆధిపత్యంలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ని తేలిగ్గా గుర్తించటానికి పత్రికలు ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చిన పదం. ఇప్పుడు మిగతా కాంగ్రెస్‌లన్నీ మాయమైపోయాయి కాబట్టి పత్రికలూ కాంగ్రెస్(ఐ) వాడకం మానేసి శుభ్రంగా 'కాంగ్రెస్' అనేస్తున్నాయి.

Your doubt is genuine. I hope Congress Party (I) clarifies to this at the earliest.

Post a Comment