Saturday, 5 September 2009

బానిస నాయకుల్లారా....

మాకు కావాల్సింది రాచరిక పాలన కాదు. రాజు పోగానే యువరాజు సింహాసనం అధిష్టించే రాచరిక వ్యవస్థ లో మనం లేము. ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులని కూల్చకండి. మీ మీ స్వార్ధ ప్రయోజనాల కోసం మీ బానిస మనస్తత్వాలను ప్రజల మీద రుద్దకండి.

మా జనాలకి వెర్రిగా మిమ్మల్ని అనుసరించటం తప్ప ఏమీ తెలియదు. నేతల అంత్య క్రియల దగ్గర కూడా టీవీ కెమెరా కనబడితే నవ్వుతూ కనపడే మనస్తత్వం జీర్ణించుకుపోయిన అల్ప జీవులం. మా చోటా నేతలేమంటే అదే కరెక్ట్ అనుకునే గొర్రెల మందలాంటి వాళ్ళం.

మాలాంటి అమాయకులతో నిరసన దీక్షలు చేయిస్తూ రాజు గారి తనయుణ్ణి ముఖ్యమంత్రి పీఠానికి వారసుణ్ణి చేయించకండి.

మీకు పదవుల పందేరం చేసిన ఒక నాయకుడు చని పోయాడని తన కొడుకే వారసుడి మళ్ళీ తన తదనంతరం మళ్ళీ తన సంతానాన్నే వారసులుగా కొనసాగాలనుకునే మీ లాంటి రాజ బానిసలే మన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.

మీకు మహా నాయకుల్లా ఎదగటం రాదు. ఎవడో ఒకడి పంచన చేరి పైరవీలు చేసుకోవటం తప్ప.

నేతలు రావాల్సింది జనాల నుండి... పాత నేతల వారసత్వాల నుండి కాదు.

ఒక నేత దుర్మరణం నుండి పుట్టిన సానుభూతి ద్వారా ఎదిగే వారసుడు కాదు మనకు కావాల్సింది.

వత్సరాలుగా జనాలతో మమేకమైన నాయకుల్లో ఒక మంచి వాడిని నాయకుడి గా ఎన్నుకోండి.

దానికోసం మీ అధిష్టానానికి కాస్త సమయం ఇవ్వండి.

జై జవాన్.... జై కిసాన్

జై హింద్



మీ
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

7 comments:

బా చెప్పారు.

కృతజ్ఞతలు శివ గారు

ఆ నాయకులు బానిసలు కాదు. వాళ్ళు దళారులు.
వాళ్ళ సంపాదనే వాళ్ళకు ముఖ్యం.
అమాయక ప్రజలే బానిసలు.

Thank you for sharing your comments sravya gaaru & bonagiri gaaru

Post a Comment