Friday, 8 January 2010

హలో... బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త ...

ఏదో దిక్కు మాలిన వెబ్ సైట్ ఓ ఊహా జనిత కధనాన్ని ప్రచురిస్తే తమ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం మీడియా ముసుగులో ఏదో సినిమా కధ లాంటి ఆ కధనాన్ని జనాల మీదకు వదిలాయి మన తెలుగు వార్తా సంస్థలు. ఎప్పుడే గొడవ చేద్దామా మన దురద తీర్చుకుందామా అని కాచుకుని కూర్చునే రాజకీయ రోమియోలు, వాళ్ళ అనుచరులు రాత్రి కి రాత్రి అరాచకం సృష్టించేసారు. రాబోవు పరిణామాలు ఆలోచించకుండా తమ TRP ratings కోసం ప్రసారం చేసిన కధనమో, మరి కొందరు అంటున్నట్లు రాజకీయ కుట్రలో మనకు తెలియదు కానీ మన బ్లాగు సోదరులు చాలా మంది కూడా ఆ కధనం ప్రభావం లో పడి పోయి నేను అప్పుడే చెప్పాను అలా జరిగి ఉండవచ్చు అని, ఇలా జరిగి ఉండవచ్చు అని మళ్ళీ బ్లాగేశారు.

కానీ బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త....

మీరు రాసే మీ ఊహాజనిత కధనాలు ఏ ఛానల్ వాడికో తెగ నచ్చేసి వాటిమీద ఏ వెర్రి వెంగళప్ప తో నో చర్చ పెట్టేసి ఓ మూడు నాలుగు గంటల పాటు చర్చ పెట్టేసినా పెట్టేస్తారు పలానా బ్లాగ్ లో ఇలా అంటున్నారు అని. ఇలాంటి కధనాల కోసమే కాసుక్కూచ్చునే బాచ్ తెగులునాట ఏ మూల కెళ్ళినా రెడీ గా ఉంటారని ప్రత్యేకం గా మళ్ళీ చెప్పాలా నిన్న రాత్రి జరిగిన దాన్ని చూసాక.

బ్లాగ్ పాపులారిటీ ఏమో గాని ఆనక పోలీసు కేసులూ గట్రా మన నెత్తి మీదే. ఆ రష్యా వాడైతే మన వాళ్లకి వెంటనే దొరక్క పోవచ్చు కానీ మనమైతే వీళ్ళ చేతులకి చిక్కటం క్షణాల్లో పని.

ఇక నుండి ఇలా జరిగి ఉండవచ్చు అలా జరిగి ఉండవచ్చు అని మనం చెప్పాలన్నా మీడియా దెబ్బ కి మన జాగ్రత్త లో మనం ఉండాలి. కాబట్ట్టి బ్లాగ్ స్నేహితులూ... తస్మాత్ జాగ్రత్త.....

మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

5 comments:

జాగ్రత్తనా? నేను అలాంటి అవకాశం కోసం చూస్తున్నానండీ బాబూ. పోలీసుకేసు అయితే అయ్యింది కానీ ప్రజల నోట్లో నేనూ, నా బ్లాగూ పడవచ్చు! నా బ్లాగు TRP రేటింగ్ పెరగనూవచ్చు!

చాల కరెక్ట్ గా చెప్పారు.....నేను ముందే వుహించాను అని చెప్పడానికి మనం ఎమన్నా వీరబ్రహ్మం లమా?

anavasara ishayaalato kalayapana ,pramadame.

baagaa cheppaaru

అవును బ్లాగులో రాస్తున్నాము. చదివేది తోటి బ్లాగర్లే కదా అని నిర్లక్ష్యం కూడదు. బ్లాగులలోని వ్యాసాలు యధాతధంగా కొన్ని పత్రికలు అచ్చువేసిన విషయం కొందరు బ్లాగర్లు మన దృష్టికి తెచ్చారు. జాగ్రత్త!

అనవసర విషయాలలో కల్పన ప్రమాదమే

Post a Comment