Friday, 3 September 2010

శ్రీధర్ కార్టూన్ లో తప్పేంటి?

ఈ రోజు ఈనాడు లో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మీద కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ కొంతమందికి అభ్యంతర కరం గా అనిపించిందట. ఆ కార్టూన్ ఒక వయోవృద్ధుడి అనారోగ్యం మీద వేసిన కార్టూన్ అని వారి భావన.
రోశయ్య గారు వయో వృద్దులు మాత్రమే అయి ఉంటే శ్రీధర్ ఆ కార్టూన్ వేస్తే అభ్యంతరకరం ఏమో కానీ రాష్ట్రాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి తరచూ అనారోగ్యం బారిన పడుతున్నప్పుడు ఆ కార్టూన్ లో అభ్యంతరం ఏముంది.
అది ముఖ్యమంత్రి అనారోగ్యం మీద వేసిన కార్టూన్ గా మాత్రమే నాకు అర్ధం అయ్యింది కానీ ఒక వృద్ధుడిని అపహాస్యం చేసిన కుసంస్కారం అందులో నాకు కనిపించలేదు.
దశాబ్దాల తరువాత ఒక మంచి ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, తమ పార్టీమహా నాయకుడు గతించి ఏడాది గతించిన సందర్భం గా అంజలి ఘటించటానికి సహకరించని ఆరోగ్యం మన ముఖ్యమంత్రి ది. పెద్ద వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించుకోవటం చాలా అవసరమే కానీ అది అనుక్షణం ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పదవుల్లో కూర్చోబెట్టి మాత్రం కాదు.
మామూలు ఉద్యోగులు 58/60 సంవత్సరాల వయసు దాటితే ప్రభుత్వానికి పనికి రారు కానీ 75/80 సంవత్సరాలు దాటిన, నిలబడితే కూర్చోలేని, కూర్చుంటే నిలబడలేని వృద్ధ నాయకులు మాత్రం బాగా పనిచెయ్యగలరట.రాజకీయ నాయకులకు వాళ్ళు చనిపోయినప్పుడు కానీ రిటైర్మెంట్ రాదు.
అయినా రాజకీయాల్లో యాభై ఏళ్ల వాళ్ళని యువ నాయకులుగా భావించే మన దేశం లో 90 ఏళ్లు వచ్చినా అది పెద్ద వయసు అనిపించదు కదా.... ఏమంటారు?

మీ

స్నేహితుడు

8 comments:

శ్రీధర్ గారి కార్టూన్లు సమయోచితంగా బాగుంటాయి. తెలుగులో
ఆర్కే లక్ష్మణ్ గారి స్ధాయి రాజకీయ కార్టూనిస్ట్ శ్రీధరే అని నా
అభిప్రాయం. ఈనాడు పత్రికను ద్వేషించే ఓ యంపీ గారుకూడా
"నే ఈనాడులో మొదట చూసేది శ్రీధర్ కార్టూనే" అని ఓ కార్టూన్
పుస్తక అవిష్కరణ సభలో అన్నారు. ఒంట్లో బాగోలేని ముఖ్య
మంత్రికి కావలిసింది తుపాకులతో వున్న సెక్యూరిటీ కాదు. కంటికి
రెప్పలా చూసుకొనే వైద్యులే! అదే శ్రీధర్ తన కార్టూన్లో అద్భుతంగా
చూపించారు.

> కొంతమందికి అభ్యంతరకరం గా అనిపించిందట
> ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు
i am seeing those are conflict statements.

> కొంతమందికి
everyone know which post you pointed.

looks like this is the counter post for that post?

మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. 60ఏళ్ళు దాటిన తర్వాత రాజకీయ నాయకులకుకూడా రిటైర్మెంట్ ఇవ్వాలి. అలా రోజులు రావాలంటే రాజకీయాల్లో యువకుల ప్రాధాన్యం పెరగాలి. రోశయ్యలాంటి పెద్దరికం పక్కనుండి సలహాలివ్వడానికి పనికొస్తుంది తప్ప నాయకత్వం వహించడానికి కాదు. ఇది మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. తమిలనాడు పరిస్థితీ అంతేననుకోండి....

పొద్దున లేచినప్పటినుండి, తనను తన్ని తరిమేసిన ఈనాడు మీద అక్కసు వెల్లగక్కేవాళ్లకు శ్రీధర్ కార్టూన్లు ఏమిటి ఖర్మ, ఏదయినా చేదే :((. కొందరు గత ఉధ్యోగ వాసలనలు, కచ్చిలు వదులుకోలేరు, ఏమి చేద్దాం, అందరమూ మానవ మానవమాతుర్లమే కదా!!!

నాకు మాత్రం శ్రీధర్ కార్టూని నచ్చింది అంతంకంటే, పాత కచ్చిలు, అక్కసులు మరసి పోని వారిమీద, జాలికూడా కలిగింది :))

@సురేఖ గారు, My art gallery, పానీపూరీ123 & అజ్ఞాత

అందరికీ కృతఙ్ఞతలు.

@ పానీపూరీ123,

1. Conflict ఏమీ లేదండీ, కొంత మందికి అభ్యంతరకరం గా అనిపించిన విషయం, వ్యక్తిగతం గా నాకలా అనిపించలేదు. నాకనిపించినది నా స్వంత అభిప్రాయమే కానీ అందరి అభిప్రాయం కాదు.

2. నా దృక్కోణం లో నాకనిపించినది నేను వెల్లడించాను తప్ప కౌంటర్ పోస్ట్ వేద్దామనే ఉద్దేశం తో కాదు.

వ్యక్తి గతం గా నాకు ఏ బ్లాగ్ మీద ద్వేషం లేదు,మీరు అనుకుంటున్న బ్లాగ్ కు నేను వ్యక్తిగతం గా అభిమానిని.

ఎవరు రాసిన పోస్ట్ అనేదాని కన్నా అందులో ఉన్న విషయం మీదే నా దృష్టి.

నాకు మాత్రం కార్టూన్ లొ ఎక్కడ అబ్యంతరంగా అనిపించలేదు. కొందరికి. గోరంతల్ని కొండంతలు చేయటం అలవాటులెండి. అటువంటి సమయంకోసమే వేచిచూస్తుంటాయి కొన్ని నక్కలు

if he is pointing a aged CM its ok. But we cant make fun of a old man.

నాకూ ఆ కార్టూను నచ్చింది..అంటే నవ్వు తెప్పించింది. అసలు రోశయ్య అయినా ఆ కార్టూను చూసి నవ్వుకునే ఉంటారు. నేను శ్రీధర్ అభిమానిని! ఈనాడుకు శ్రీధర్ ఒక గొప్ప ఎస్సెట్.

Post a Comment