Thursday, 5 September 2013

నేతి నైవేద్యాలు

దేవుడున్నాడనేది నిజం అని ఆస్తికుల నమ్మకం
దేవుడులేడనేది నిజం అనేది నాస్తికుల నమ్మకం 
ఉన్నాడన్న నమ్మకమే భూషణమై 
గుళ్ళో భోషాణాలు నింపేవారు ఆస్తికులు
లేడన్న నమ్మకమే పునాదిగా 
రుజువు చూపితే కోట్లు ఇస్తామనేది నాస్తికులు

రాతి బొమ్మలకి రంగురాళ్ళ ఉంగరాలు 
నిశ్చల విగ్రహాలకి నేతి నైవేద్యాలు 
భావజాలపు నమ్మకాలకి జేజేలట
రుజువు చూపితే చాలట నోట్లకట్టలేనట

మనిషి ఉన్నాడనేది జగమెరిగిన సత్యం
మరి మనిషికి మనిషి ఉన్నాడన్నది నిజమా?
జగంలో ఓ వంతు జనం ఎండిన డొక్కలతో
మరో వంతు జనం అర్ధాకలితో ఉంటున్నారనేది
అందరికీ తెలిసిన ఎవరూ కాదన లేని నిజం

రంగురాళ్ళ ఉంగరాల అవసరం లేదు
తిన్నా అరగని ఆ నేతి నైవేద్యాలు వారికొద్దు
మనఃశాంతి పోగొట్టే నోట్ల కట్టలసలే వద్దు
నోట్లో కి నాలుగు వేళ్ళు వెళ్ళే సాయమే ముద్దు

1 comments:

అవును పాపం.. నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్ళనీకుండా లాగేసుకొని... నేతినైవేద్యాలు పెట్టెస్తున్నారే..నిజమే. నిజమే.. గుళ్ళో ఉన్న భోషాణం కాళిచేసి రాజకీయనాయకులకు,ఋజువులడిగే నాస్తికులకు ఇచ్చేద్దాం.. ఎంచక్కా పంచేస్తారు..

Post a Comment