Friday, 7 August 2015

దృక్పథం


ప్రేమని  ఇవ్వటమంటూ వస్తే 
అంతకు రెట్టింపుగా 
తాను గుండెను చుట్టుకు పోతుందని 
తెలుసుకున్నాక 
ఒక్క ఆత్మీయ స్పర్శతో 
ఆవిరి అయిపోయాయి
కంటి నుండి కురిసిన 
ఒంటరి క్షణాలన్నీ

నవ్వులు కన్నీళ్ళ ముసుగులుగా
కన్నీళ్లు నవ్వులకి తొడుగులుగా 
పరస్పరం తారుమారు అవుతున్న 
ప్రాణ మిత్రులే అన్న నిజం 
నన్ను తాకినప్పుడే 
కొత్తగా శ్వాసించటం మొదలు పెట్టా 
అంతరాత్మల తీరాలని ముడివేసే  
అంతెరుగని ప్రేమైక అలగా…!


2 comments:

అద్భుతంగా రాసేస్తున్నారు. అభినందనలు

బాగుంది సురేష్గారు

Post a Comment