Thursday, 27 April 2017

తాళం చెవి

నా తాళం చెవి
తన ఇల్లుని పారేసుకుంది


ఇల్లుల్లూ తిరిగాను
దేనికీ సరిపోలేదు


వెదుకుతూనే ఉన్నాను
ఇళ్ళన్నీ ముగిసే వరకూ


బహుశా
నా ఇంటికి ఎవరో కొత్త తాళం వేసినట్లున్నారు

నా కాలం ముగిసింది
వెదుకులాట ఆగింది


తాళంచెవి కొనసాగుతుంది
నా వారసుడి చేతిలో మరింత ఆశగా



1 comments:

ఇలాంటి ఆలోచనలెలా వస్తాయండీ మీకు...

Post a Comment