Saturday, 29 April 2017

తేమ మిగిలిన చోట...



నీ కోసం
నన్ను నేను తుంచుకుంటాను

ఇంతలో 
నువ్వు నడిచిన దారి
ఎక్కడికో తప్పిపోతుంది

కాలమంతా 
నిన్నే వెదుకుతూ
గాజు కలల గాలిలో 
కొట్టుకుపోతుంటాను

కంటి కింద కాస్త తడిని దాచుకున్న
ఎవరో ఒకరు
నన్ను నీ దగ్గరకు చేర్చుతారు
ప్రపంచం భుజం మీద
మనిషి అలికిడిని భరోసాగా తడుతూ

2 comments:

అర్థమైయ్యూ కానట్లుంది కానీ ఓ ఆర్థృమైన భావన...

Still trying to understand the meaning.......

Post a Comment