Wednesday, 3 May 2017

తేమ గ్రంథం



ఒక రాత్రిని
నెమ్మదిగా అల్లుకున్న మల్లె పందిరి క్రింద
చల్లగా సేద తీరుతున్న వేసంగికి
గాలే పంజరమైన గాథలో
కలువ రేకుపై మెరుస్తూ
ఎవరో వస్తున్నట్లున్నారు

పూలకి ఈతనేర్పే గాలి వాకిట్లో
కాసేపలా గడ్డకట్టుకు పోతూ
ఇదిగో
ఇక్కడే ఆగి చూసా

మట్టి తునకని ఆఘ్రాణిస్తున్న
ఒక విశ్రాంతి వాన చినుకులా
చాలా చిన్నగా మొదలయ్యావు

ఇప్పుడేమో
ఈ కాగితంపై కవిత్వమై పిలుస్తున్నావు
మనసుకంటిన మోక్ష గంథంలా
కళ్ళు రాసిన తేమ గ్రంథంలా !!!


3 comments:

వావ్ వావ్ సో సో లవ్లీ రియల్లీ ప్లెజెంట్ఫీల్.

గంధం చలువ కనులకు తాకిందేమో
తడిజాడలన్నీ పన్నీరు కురిసేలా
తీపి చెమరింతలన్నీ భావమై పొంగేలా

Post a Comment