Thursday, 4 May 2017

ఒక నల్లని వెలుతురు



ఒక నల్లని వెలుతురు
అవును
నలుపే వెలుగుని గాఢంగా రాయగలదు
ఆకాశం నిండా
కాసిని మెరుపులని
ఓ గుప్పెడు తారలని
వెళ్లాడదీసుకుంటూ
తనే ఒక వెలుతురుని అవిశ్రాంతంగా మోయగలదు

నమ్మవా ఏం?

సరే మరి...
నువ్వు చూపించు
ఏ పగలైనా
నీకోసమంటూ
కాసిన్ని నక్షత్రాలని  చల్లగా పూసిందేమో!

***

రా మరి !
వెలుగుపై కప్పిన చీకటినీ
సీతాకోకచిలుక రెక్కలంత
ఇష్టంగా హత్తుకుందాం



3 comments:

ఏ పగలైనా నీకోసమంటూ కాసిన్ని నక్షత్రాలను చల్లగా పూసిందాని అడగడం సూపర్బ్ థాట్. లవ్లీ పొయెమ్ అండీ.

Post a Comment