Sunday, 7 May 2017

ఆకు


చిరు కొమ్మ చివరన చిగురేసుకుని వచ్చినప్పుడు
కొంగ్రొత్త చిలకపచ్చదనపు మెరుపులో వళ్ళు విరిచింది

యవ్వనం యక్ష గానం చేస్తున్నప్పుడు
గాలి చేస్తున్న గాంధర్వానికి మైమరపుతో తాళం వేసింది

ఎండ బారిన మనిషి  మేనిపై
నీడల దడితో శుశ్రూష చేసింది

చెట్టుకి తాను మోయలేని బరువనుకున్నప్పుడు
మౌనాన్ని శబ్దిస్తూ రెప్పపాటులో  రాలిపోయింది

ప్రకృతికి  సారవంతమైన నేలని కానుకిస్తూ
కుళ్ళిన తనువుతో  
తపమొనర్చుతూ మట్టిలోకి మాయమయ్యింది

ఆత్మార్పణ వేళ ఎప్పుడో
జీవితాన్ని వెలిగించుకోవటమంటే ఏమిటో
పంచ భూతాలూ పచ్చగా నవ్వినప్పుడే తెలిసింది



1 comments:

సో లవ్లీ ఎక్స్ ప్రెషన్... ఆత్మార్పణ వేళ జీవితాన్ని పచ్చగా వెలిగించుకోడమంటే ఏమిటో పంచభూతాలూ పచ్చగా నవ్వినప్పుడే తెలిసింది...సూపర్బ్!

Post a Comment