Thursday, 10 August 2017

స్వేచ్ఛ

స్వేచ్ఛ అంతా తమ రెక్కల సత్తువలోనే
ఉందని  తెలుసుకున్న పక్షులని ఆపడానికి
ఎన్ని రెక్కలని కత్తిరించగలవు నువ్వు?


వీలయితే…
ఆ రెక్కలపై నీ కుంచెతో కాస్త రంగులద్దు
తమ స్వేచ్ఛతో పాటే
నీ చిత్రకళనూ లోకమంతా గానవిస్తాయి


మరప్పుడు
కాలమండలమంతా నీ స్వచ్ఛతా చిత్రమే కదా!


3 comments:

స్వేచ్ఛా విహంగమై ఎగిరితే ఎంత బాగుంటుందో.

స్వీట్ అండ్ సింపుల్...

కృతజ్ఞతలు ప్రేరణ గారు

Post a Comment