Sunday, 17 September 2017

అమృతమంటే...

వెలసిపోయిన కాగితాలను
చూసిన కథలున్నాయి గానీ
వెలసిపోయిన అక్షరాల
చరిత్ర ఎక్కడా కనపడలేదు.

మనసుకి చేరిన అక్షరాలు
చరిత్రలో కొనసాగటానికి
ఏ శాసనాలూ… కాగితాలూ
అవసరం లేదు

అప్పటికే అవి

తమ విలువని
ఉన్నతంగా రాసేసుకున్నాయి మరి

అందుకే అనిపిస్తుంది
అక్షరమంటే అమృతమని
నేటి అమృతమంటే అక్షరమని

1 comments:

నిజమే కదా... అందంగా చెప్పారు చాలా బావుంది.

Post a Comment