మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label నిశ్చలత. Show all posts
Showing posts with label నిశ్చలత. Show all posts

Friday, 25 November 2022

శిల

 



ప్రతి కన్నీటి బొట్టు 

ఓ రహస్య ప్రపంచపు లోతులని 

పరిచయం చేస్తుంటే 

హృదయపు కదలికలోకి  

ఒక నిశ్చలతని ఆవాహన చేసుకున్నట్లుగా 

ఇక్కడ నా కన్నీటిని 

నిశ్శబ్దం చేసుకున్నాను 


ఎవరికీ పరిచయం లేని 

ఒక మధ్య రాత్రిలో 

నా తలగడే కాగితమయ్యింది… 

పొద్దున్న నిశ్శబ్దమైన 

అశ్రువుని అనువాదం చేయడానికి !


… 


ఎప్పటిలాగానే తెల్లవారింది 

స్పందన లేని కఠిన శిలగా 

నన్ను మేల్కొలుపుతూ