మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Sunday, 14 February 2010

అసమర్ధుని ప్రేమలేఖలు-2

ప్రియా..

తొలి వలపు వలచిన నాడు అనుకోలేదు...
ఈ వలపు తలపులకే పరిమితమని.

తొలి తలపు మది తట్టినప్పుడు అనుకోలేదు...
జీవితాంతం నా తోడు తానేనని.

తొలి ఊహ మదిలో మెదలినప్పుడు అనుకోలేదు
జీవితాంతం ఆ ఊహలు మాత్రమే ఊపిరి అని

తొలి ఆశ నన్ను తట్టినప్పుడు అనుకోలేదు
నా ఆలోచనలు ఆశల వరకే పరిమితం అని

చిన్నప్పుడు ఆడుకున్న బుల్లి బుల్లి ఆటలు నిజమైతే ఎంత బాగుండు. ఆ రోజులే కనుక తిరిగి వస్తే?
తలచుకుంటేనే మదిలో ఆనందం, హృది లో సంతోషం, ఎదలో పులకింత

నిజం ప్రియా...

ఆ రోజులూ నేటి ఆలోచనలు కలగలసి వస్తే నా అంతటి అదృష్టవంతుడు ఈ భూమి మీద ఉండడు.

కానీ అది సాధ్యమేనా? కాలాన్ని వెనక్కి తిప్పటం సాధ్యమేనా?

నాకు కాలం మీద పరిశోధనలు చెయ్యాలని ఉంది. కాలాన్ని వెనక్కి తిప్పటం కోసం.

ఎప్పటికీ చిన్న పిల్లలం అయిపోయినా బాగుండు. కనీసం స్నేహితుడు గా అయినా ప్రతీ రోజూ నీ సన్నిధిలో ఉండేవాడిని.

గడచిన జన్మలో ఏ ప్రేమ జంటను విడదీసానో.. ఈ జన్మలో ఈ వేదన నాకు...

నీ......

Saturday, 13 February 2010

ఓ అసమర్ధుని ప్రేమ లేఖలు-1

Tuesday, 2 February 2010

ఓ లక్ష్మణ రావు గారూ

ఓ పసితనం మాడిన వేళ, ఓ పితృ హృదయం ఆగిన వేళ యావత్ ప్రపంచం దృష్టీ అక్కడే ఉంది. కసాయి వెధవలు కిరాయి కోసం చేసిన ఘాతుకాన్ని అందరూ ఖండించటం నిజం గా హర్షణీయం.

కానీ వీళ్ళ కుటుంబ వ్యవహారాలతో ఏ సంబంధం లేని ఓ పేద డ్రైవర్ హత్య మాత్రం ఏ ఒక్కరి కంటికీ ఆనక పోవటం (ప్రధాన మీడియా తో సహా) అంటే బాధాకరం. నా వరకూ నాకు ఎవరి హత్య అయినా ఒక్కటే. కారు డ్రైవర్ లక్ష్మణ రావు, చిన్నారి తల్లి వైష్ణవి ల హత్యలతో ప్రత్యక్షం గా, వైష్ణవి తండ్రి ప్రభాకర్ చావుకి పరోక్షం గా సంబంధం ఉన్న నరరూపరాక్షసులు అందరినీ బహిరంగంగా ఒక్కొక్క అవయవాన్ని రంపాలతో కోసి చంపాలి.

కిడ్నాప్ కి గురైన రోజున (చనిపోయిన వార్త తెలిసేంత వరకూ) నాగ వైష్ణవి పేరు గానీ, ఆమె తండ్రి ప్రభాకర్ పేరు గానీ తెలియని వారే లేరు. కానీ తనకు సంబంధం లేని గొడవల్లో తొలి సమిధగా మారిన కారు డ్రైవర్ లక్ష్మణ రావు పేరు ఎంత మందికి తెలుసు. చావుకి పేదైనా గొప్ప అయినా ఒక్కటే. ఓ పేద కుటుంబం లో సంపాదించే వ్యక్తి పోతే ఆ కుటుంబానికి ఆలంబనే ఉండదు. తన కోసం మనమేమీ చెయ్యలేకపోయినా అశ్రువొక్కటి ధారపోద్దాం.

ఓ లక్ష్మణ రావు గారూ, అందుకోండి మీ ఆత్మ శాంతి కోసం నా అశ్రు నివాళి.మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)