మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label చిత్ర సీమ. Show all posts
Showing posts with label చిత్ర సీమ. Show all posts

Saturday, 21 August 2010

హీరోలు మాత్రమే దోషులా?


టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారో ఇరుక్కో బోతున్నారో అంటూ మీడియా అంతా హోరెత్తి పోతుంది. నిజంగా డ్రగ్స్ వాడటం తప్పే కాదనలేం. సినిమా హీరోలు హీరోయిన్లు అందరూ నిజజీవితం లో కూడా హీరోల్లా ఉండరనేది వర్తమాన భారతంలో జనమెరిగిన సత్యం.

సెలెబ్రిటీల వార్తలంటే ప్రజానీకానికి ఆసక్తి ఎక్కువ కాబట్టి మీడియా దృష్టి అంతా వీళ్ళ మీదే ఉంచి, ఈ సమస్య మూలాల మీద ఫోకస్ తక్కువ పెడుతున్నారు.

కొకైన్ ఎవరు కొంటున్నారు అనేదానికన్నా, అసలు కొకైన్ ఇండియాలోకి ఎలా వస్తుంది? సముద్ర మార్గం ద్వారానా? వాయు మార్గం ద్వారానా? ఏ మార్గం ద్వారా వచ్చినా కస్టమ్స్ అధికారులు ఏం చేస్తున్నారు.?

కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పి ఇండియా లోకి వచ్చాక కూడా వివిధ నగరాలకు ఎలా చేరవేయ గలుగుతున్నారు. నిఘా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు?

ప్రతిపక్షాల వ్యవహారాల మీద, స్వపక్షంలో తోక ఝాడించే వారిమీద నిఘా పెట్టటానికే అధికారులను ఉపయోగించుకుంటున్నదా అధికార పక్షం.?



మన దేశ మాజీ రాష్ట్రపతినే బట్టలు విప్పి చెక్ చేసారట వేరే దేశపు అధికారులు. గోద్రాలో మతకల్లోలాలకి భాధ్యుడిని చేసి ఒక రాష్ట్ర ముఖ్య మంత్రికే వీసా మంజూరు చెయ్యలేదు అదే దేశం.

మరి మనం? మన దేశం లోకి వచ్చే దెవరో... వారు వెళ్ళారో లేదో... తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం.

విదేశీయులు విజిటింగ్ వీసా మీద వచ్చి ఏళ్లకేళ్ళు మనదేశంలో పాతుకు పోతుంటే అధికార యంత్రాగం ఏం చేస్తున్నట్లు.?

అసలు విజిటింగ్ వీసాల మీద వచ్చి గడువు లోపల దేశం విడవని వారి వివరాలు & ఫోటోలు అన్ని రాష్టాల పోలీసు యంత్రాగానికి అందించి అలాంటి ఎలుకల్ని కలుగుల్లో నుండి బయటకు ఎందుకు రప్పించరు.?

ఇలాంటి వాళ్ళే నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగిస్తున్నారు. వేలాది మంది విజిటింగ్ వీసాల మీద, ఇరుగు పొరుగు దేశాల నుండి తప్పుడు వీసాల మీద వచ్చి ప్రధాన నగరాల్లో  పాతుకు పోయి దేశాన్ని నాశనం చేస్తున్నారు.

పొరుగు దేశాల నిఘా వర్గాలు దొంగ నోట్లు ముద్రించి మన దేశం లో వాటిని చెలామణి చేసి మన ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నసంగతి తెలిసీ వాటిని నిరోధించలేని మన నిఘా వ్యవస్తని సంస్కరిస్తే దేశానికి ఎన్నో ఇక్కట్లు తొలగి పోతాయి.

ఇంటలిజెన్స్ వర్గాలని అధికార పక్షాలు తమ ఇంటి పాలేరులుగా వాడుకోవటం మానేసి దేశం లో అసాంఘిక శక్తుల మీద నిఘా పెంచితే బాగుంటుంది.

కనీసం మీడియా తమ ప్రయత్నం గా ఇలాంటి విషయాల మీద చొరవ చేస్తే బాగుండు.

రాజ్ భవన్లో మాజీ గవర్నర్ శృంగార లీలల మీద కాదు స్టింగ్ ఆపరేషన్ లు చెయ్యాల్సింది. దేశంలో యువశక్తిని నిర్వీర్యం చేసే వర్గాలను బయట పెట్టే స్టింగ్ ఆపరేషన్ లు కావాలి.

అలా చెయ్యబోయే తొలి జర్నలిస్ట్ కి ఇప్పుడే చేస్తున్నా పాదాభి వందనం.

మీస్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)


Saturday, 5 September 2009

తెలుగు వాళ్ళు వెర్రి అభిమానులు తమిళులు మర్యాదస్తులు.... హీరోయిన్ త్రిష

ఈ రోజు సాక్షి పేపర్ తమిళనాడు ఎడిషన్ లో హీరోయిన్ త్రిష చెప్పిన మాటలివి.

నిజమే... మనం కూడా తమిళుల లాగా హీరో లకి హీరోయిన్ లకు గుళ్ళు కడితే మనం మర్యాదస్తులం అవుతాం. పరభాషా హీరోయిన్ లని తీసుకుని వచ్చి మనం నెత్తి మీద పెట్టుకుంటున్నామంటే అది నిజంగా వెర్రి అభిమానమే అయిఉంటుంది.

పూర్తి పోలీసు సెక్యూరిటీ తో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నమిత ని అడిగితే తెలుస్తుంది హీరోయిన్ల పట్ల తమిళుల కున్న మర్యాద.

'ఆకాశమంత' అంటూ మన మనసుల్ని తట్టిందని మనం తనని మన ఆడపడచుగా ఆదరిస్తున్నాం. అభిమానులే లేకుంటే వీళ్ళకు స్టార్ డం ఎక్కడిది? అభిమానుల అభిమానమే వెర్రి అనుకునే నాయికలు మనకు అవసరమా?

మెరీనా బీచ్ తీరం లో, పబ్ లలో మందుకొట్టి చిందులేసే ఇలాంటి నాయికల మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే...

విలువ ఇవ్వ వలసిన అవసరం లేకపోయినా తెలుగు వాళ్ళు ఆడవాళ్ళని అల్లరి చేసే చిల్లర వెధవలు అనుకునే ప్రమాదం లేకపోలేదు.

అందుకే నా బాధ.

సినిమా ప్రేమికులారా మంచి సినిమాలని అభిమానించండి. ఇలాంటి నాయికల మీద అభిమానాలు పెంచుకుంటే మనకు మిగిలేది అవమానాలే...