మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 28 October 2023

ధైర్య పతాకం

 



ప్రశాంతపు నది వాలులో సాగిపోతున్న నిశ్శబ్దం

ఎక్కడ శబ్దంగా మారుతుందో… 

అక్కడ ఒక ధిక్కారమేదో మొదలయ్యిందన్న మాట!!

నదిని చీల్చుకుంటూ 

ప్రవాహాన్ని ఎదుర్కొంటున్న ఉధృతమది 


ప్రవాహానికి ఎదురెళ్లడం 

ఒక వాంఛగా మారినప్పుడు 

లోలోపలి కదలికల అలజడులే ఊతంగా 

భయాల జాడలన్నీ 

ఏటి వాలులో కొట్టుకుపోతాయి... 

ధైర్యమొక పతాకమై 

తీరాన్ని రెప రెపలాడిస్తుంది!!!



Friday, 27 October 2023

పాటకి దొరకని....

 




ఎక్కడి పాటనో 

ఇక్కడిలా ఒంపేసి 

మాయమైపోయారెవరో! 


రాగం మరచిన పాట 

గొంతుని అరువిచ్చే 

హృదయం కోసం 

వీధి వీధిలో వెల్లువెత్తిన గానమై 

వెతుకులాడుతూ ఉంది. 


సరిగమలు…

శృతిలయలు… 

అంటూ గొంతు సవరించుకుంటూ 

వేదికనెక్కిన విద్వత్తేమో 

విలువల గురించి పలవరిస్తుంది.!!!