మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Thursday, 31 January 2013

కలల నేస్తం


వెన్నెల కొలనులో కడిగిన మంచుముత్యమంత స్వచ్చమైన మనస్సు
పాలసముద్రంలో నీళ్ళోసుకున్న తొలకరి మేఘమంత నిండైన హృదయం
నిండు పున్నమి వేకువన జాబిల్లి జోలపాడి జోకొట్టినట్లుండే పలకరింపు 
ఏకాంతం నా నేస్తమైనప్పుడు పలుకరించే నన్ను కమ్ముకునే ఙ్ఞాపకం
నా ఙ్ఞాపకాల పొత్తిళ్ళలో పవళించిన పసిపాప 
అలసిపోయిన ఒత్తిళ్ళలో చల్లని వెన్నెల రేఖ....
ఎవరోనన్న నా అన్వేషణ ముగిసింది నిన్ను చూడగానే