స్వేచ్ఛ అంతా తమ రెక్కల సత్తువలోనే
ఉందని తెలుసుకున్న పక్షులని ఆపడానికి
ఎన్ని రెక్కలని కత్తిరించగలవు నువ్వు?
వీలయితే…
ఆ రెక్కలపై నీ కుంచెతో కాస్త రంగులద్దు
తమ స్వేచ్ఛతో పాటే
నీ చిత్రకళనూ లోకమంతా గానవిస్తాయి
మరప్పుడు
కాలమండలమంతా నీ స్వచ్ఛతా చిత్రమే కదా!