(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)
అసాధ్యమన్నదే లేదు ఆత్మవిశ్వాసం నీకుంటే
అపజయమే దరికి రాదు ఆత్మస్థైర్యం నీకుంటే
గుండె బలముంటే గెలుపన్నది నీ ఇంటి గడపే
నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో
నిరాశతో కుంగిపోకు నీ శక్తే నీకు బలం
ఓటమికి వెరవొద్దు అదే నీ గెలుపుకి తొలి మెట్టు
నొప్పికి వెరవకుంటే ముళ్ళు కూడా పువ్వులే
నిన్ను నీవు నమ్ము కుంటే ప్రతి పనిలో విజయాలే
నాకంటూ ఓ రోజు వస్తుందని కూర్చుంటే
కాలం కరుగుతుంది కాని నీకా రోజు రాదులే
ఈ రోజునే నీ రోజుగా చేసుకో
ప్రతి క్షణం విజయం నీదని తెలుసుకో
నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో
సలహాలకేముంది ఎవరైనా ఇస్తారు
సాయం చేయ రమ్మంటే వారంతా పరారు
దేవుడేమి చేస్తాడు నీ ప్రయత్నం లేకుండా
నీ శ్రమ తోడైతే ఆ దేవుడే నీకు జోడు
నీ ఖర్మకు నీవు కాక ఎవరు బాధ్యుడు
నీ లక్ష్య ఛేదనకు ఆత్మ బలమే ఆయుధం
నీ కలల సాధనకు ఆత్మ విశ్వాసమే అస్త్రం
నిన్ను నీవు తెలుసుకో నీ శక్తిని నమ్ముకో
కోటప్ప కొండకు దైవ దర్శనానికి వెళ్ళిన శాంభవి అనే బాలికను అదే పనిగా ఈ రోజు అంతా TV9 లో చూపిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఆ పాప గురించి కొన్ని వార్తలు చదివాను కానీ ప్రత్యక్షంగా తన మాటలు విన్నది మాత్రం ఈ రోజే.
ఆ చిన్ని పాపని చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. తను వల్లె వేస్తున్న మాటలు అంత కన్నా ముద్దుముద్దుగా ఉన్నాయి. కానీ ఆ మాటల్లో సత్యాసత్యాల సంగతేమిటో నాకైతే అంతుబట్టటం లేదు.
నిజానికి ఆ పాపలో అద్భుత గ్రాహక శక్తి ఉండి ఉండాలి.దానిని ఎవరైనా స్వార్ధ పరులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. తను చెప్పే విషయాల్లో ఏదీ నమ్మశక్యం గా లేవు.
తను దలైలామా పూర్వ జన్మలో స్నేహితులట. ఇద్దరూ కలసి గౌతమ బుద్ధుని వద్ద శిష్యులు గా ఉండే వారట. టిబెట్ కి ఇంకొక 3 సంవత్సరాలలో (2012) స్వాతంత్ర్యం ఇప్పించటానికే తాను జన్మించిందట. వీర బ్రహ్మేంద్ర స్వామి వీర భోగ వసంత రాయలు గా 2012 లో జన్మిస్తారట. మంచి వాళ్ళని రక్షించి పిచ్చి వాళ్ళని (చెడ్డ వాళ్ళని కాదు) సంహరిస్తాడట. 2012 లో మంచి భూమి మిగిలి చెడ్డ భూమి నాశనం అవుతుందట. (భూమి లో మంచీ చెడ్డా నాకు అర్ధం కాలేదు).
భారత దేశం బాగానే ఉంటుందట కానీ చైనా, పాకిస్తాన్ & అమెరికా దేశాలు నాశనమైపోతాయట. (బహుశా చెడ్డ భూమి అంటే మనదేశానికి శతృదేశాలేమో అనిపించిది తను చెప్పిన ఈ మాటలు విన్నాక)...
ఇవన్నీ విన్నాక నాకు కొన్ని సంగతులు అర్ధం కాలేదు.
2012 లో సునామీలు, భూకంపాలు వచ్చి చైనా నేలమట్టమై పోతే ఇక ప్రత్యేకంగా టిబెట్ కి స్వాతంత్ర్యం ఇప్పించటానికి తాను జన్మించవలసిన అవసరం ఏమిటి.
చైనా, పాకిస్తాన్, అమెరికా తదితర దేశాలు సునామీలు, భూకంపాలు వచ్చి నాశనం అయిపొతే వీరభోగ వసంతరాయలు వచ్చి ఏం చేస్తారు?
ఆ మధ్య ఓ జులపాల స్వామి వారు తమ ముఖార విందాన్ని రాత్రికి చందమామలో దర్శించమని తరువాత తూఛ్... తూఛ్.... ఇప్పుడే కాదు అన్నట్లు, కొన్నాళ్ళాగాక... బహుశా 2012లో) ఈ పాప చేత కూడా నాకు దేవుడి నుండి సందేశం వచ్చింది ఇంకా పాపం పూర్తిగా పండలేదు అందుకే ఇంకా టిబెట్ కి స్వేచ్ఛ రాలేదు అనిపించరంటారా?
ఇలా అంటున్నానని నేనేం నాస్తికుణ్ని కాదు. కానీ దేవుడి పేరు చెప్పి చిన్న పిల్ల చేత ఇలా చెప్పిస్తున్నారేమో అని బాధ గా మాత్రం ఉంది.
మీ
స్నేహితుడు
ఈ రోజు సాక్షి పేపర్ తమిళనాడు ఎడిషన్ లో హీరోయిన్ త్రిష చెప్పిన మాటలివి.
నిజమే... మనం కూడా తమిళుల లాగా హీరో లకి హీరోయిన్ లకు గుళ్ళు కడితే మనం మర్యాదస్తులం అవుతాం. పరభాషా హీరోయిన్ లని తీసుకుని వచ్చి మనం నెత్తి మీద పెట్టుకుంటున్నామంటే అది నిజంగా వెర్రి అభిమానమే అయిఉంటుంది.
పూర్తి పోలీసు సెక్యూరిటీ తో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నమిత ని అడిగితే తెలుస్తుంది హీరోయిన్ల పట్ల తమిళుల కున్న మర్యాద.
'ఆకాశమంత' అంటూ మన మనసుల్ని తట్టిందని మనం తనని మన ఆడపడచుగా ఆదరిస్తున్నాం. అభిమానులే లేకుంటే వీళ్ళకు స్టార్ డం ఎక్కడిది? అభిమానుల అభిమానమే వెర్రి అనుకునే నాయికలు మనకు అవసరమా?
మెరీనా బీచ్ తీరం లో, పబ్ లలో మందుకొట్టి చిందులేసే ఇలాంటి నాయికల మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే...
విలువ ఇవ్వ వలసిన అవసరం లేకపోయినా తెలుగు వాళ్ళు ఆడవాళ్ళని అల్లరి చేసే చిల్లర వెధవలు అనుకునే ప్రమాదం లేకపోలేదు.
అందుకే నా బాధ.
సినిమా ప్రేమికులారా మంచి సినిమాలని అభిమానించండి. ఇలాంటి నాయికల మీద అభిమానాలు పెంచుకుంటే మనకు మిగిలేది అవమానాలే...
|