మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Showing posts with label Poetry. Show all posts
Showing posts with label Poetry. Show all posts

Tuesday, 21 February 2023

The Symphony of Wings



How many wings can you cut

To stop the flight of birds?

Their freedom lies in the power

Of their wings, in these words.


If you can, paint those wings with your brush,

They'll sing your paintings worldwide.

In their freedom song, hear the rush,

As their wings stretch open wide.


Then, you'll be the purest painter,

Of all time, in their eyes.

For you captured freedom's flavor

In those wings, that reach the skies.


Sunday, 19 February 2023

The Unbreakable Soul

 


When they left me by my skin tone,

I am not alone.

My color is still with me

And gives me an identity.

 

When the world is against my words,

I am not alone.

My words are still with me

And become free verses for change.

 

When somebody has stolen everything in my life,

I am not alone.

My courage is still with me,

And I will be back with a bang.

 

When I lost my battle,

I am not alone.

My experience is still with me,

And it leads me to win forever.

 

Even after my last breath,

Yet, I won't be alone.

My soul will still be in nature,

And the five elements of nature will be my mates.


Saturday, 18 February 2023

A Journey into Purity




The immutable silence...

Trapped in an air cage


Ages of waiting… 

Depositing on the sound of engraved snowflakes


O wanderer, Please come

This is the time to come


O wanderer, 

Come soon and complete your Metamorphosis

Like an endless lightning

And give rest to the darkness, 

That has been guarding the small lamp for ages


O wanderer, 

This is the time to come

And Warmly awaken the cool sound 

That is solidifying into the great silent state 


O wanderer, 

Breath in the time 

On the banks of the ocean of purity 

Feel the greenery 

That enhanced with fresh breezes 

And the flavor of friendship 


O wanderer, translate 

The Charge of the rain 

That has settled on the eyelid

To the wings of a butterfly 

And become the endless liberty


Friday, 10 February 2023

Echoes of the Heart

 



Oh, Messenger of mine,

From the depths of sorrow and pain,

You've emptied my soul, made it barren and vain,

Left me to wander, lost in the rain.

 

In the heat of battles untold,

My heart yearns for your embrace,

As the night sets, my soul grows cold,

And my mind is filled with your grace.

 

The echoes of our past still linger,

In the whispers of winds that roam,

My heart aches with the pain they bring her,

And my soul longs for you alone.

 

The future is yet to be seen,

But I trust in your guiding hand,

With you by my side, my heart is serene,

In your embrace, I am a happy man.

 

Your words are a balm to my weary soul,

How I long to feel your touch,

For in your presence, I am whole,

And in your love, I find solace so much.

 

Oh, how I've missed your tender gaze,

The warmth of your embrace so divine,

For in your love, I find peace and grace,

And in your arms, I am forever thine.

 


Saturday, 17 December 2022

కన్నీటి పతాకం

 



మనమెప్పుడూ బాటలం

ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ 

చిన్న చినుకులకే చిధ్రమవుతూ 

చిత్ర విచిత్రమైన నడకల్ని భరిస్తూ 


వాళ్లెప్పుడూ వాహనాలే  

ఎండైనా… వానైనా 

తమకి నచ్చిన వేగంతో నడుస్తూ 

అలసట వచ్చిన చోట ఆగుతూ 

రహదారిని  తమ హక్కుగా చేసుకుంటూ !


ఎంతైనా 

పన్ను కట్టిన వాడికే 

దారిమీద హక్కుంటుందంటారు కదా 


మనమెప్పుడూ పాపాలం 

వారివేమో పవిత్రాత్మలు 

అంతేగా మరి… 

బతుకే బతుకులో ఏ  అర్థమూ లేక 

మన దేహాలు 

నడిచే సజీవ సమాధులైతే 

వారి దేహాలేమో 

మన పాపాలని గ్రుక్కిట పడుతూ 

మన బ్రతుకుల మీద 

ముక్తిని ధృవీకరించే వ్యాకరణాలు 


మన అభిప్రాయాల వ్యక్తీకరణలన్నీ 

వారి అధికారపు నిర్ణయాల మాటున   

విధిగా  చల్లబడుతుంటే 

మనం పూసే విషాదాల  మీద 

వారు చిరునవ్వులుగా విరబూస్తారు

***


అవును… 

లోకధర్మమింతే 

తమని తాము ఎక్కువ సమానంగా 

శాసనాలు రాసుకున్నాక 

మనం రాసే దిగుళ్ళకి కార్చే కన్నీళ్ళకి 

అందే  లెక్క ఒక్కటే 

కొన్ని జన్మలు అవనతం కాని  కన్నీళ్ల పతాకాలు అని


(Published in 01.12.2022 Saranga Magazine)

Tuesday, 6 December 2022

ముగింపు లేని వాక్యం

 



అవును…

నువ్వన్నట్లుగా 

ఆదీ నువ్వే…  అంతమూ నువ్వే కావచ్చు 

ఆదికీ అంతానికి మధ్యన నేను ఉన్నాను 

దారి ఉండనీ లేకపోనీ 

నా అడుగులు ఈ నేలనే ముద్దాడుతున్నాయి  


నీకు నేను తెలియక పోవచ్చు 

కానీ నా ఉనికి నాకు అందుతూనే ఉంది 

నా ఊపిరి సాగినంత మేరా 

నా ఉనికి వ్యాపితమయ్యే ఉంది 


నువ్వనుకున్నట్లుగానే 

నాకు ఏమీ తెలియక పోవచ్చు 

నువ్వు ఎక్కిన ఎత్తులు నాకు అందక పోవచ్చు 

నువ్వు చూసిన లోతులు నాకు  తెలియకపోవచ్చు 

నువ్వెళ్ళగలిగే ఏ చోటికీ నేను వెళ్ళలేక పోవచ్చు 


అయితేనేం… 

నా ఏమీ తెలియనితనమే 

కనిపించిన ప్రతి దాన్నీ శోధిస్తూ 

నాలో ప్రశ్నలు పుట్టిస్తుంది 

ఒక ముగింపు లేని వాక్యంలోకి నిన్ను లాగుతూ  

నీ అస్తిత్వపు ఉనికికే ముప్పుటిల్లేలా


Monday, 5 December 2022

బ్రహ్మ లేఖనం...

 



నివురు క్రింద  దాయబడిన 

నిప్పుకణికల ఉనికంతా 

బూడిదగా పేరుకుపోతున్న  

మహా నిశ్శబ్దంలో 

చిక్కుబడినట్లుంది 

బ్రహ్మ లేఖనం... 


ఏ ఆరడిలోని ఇమడని  

నిప్పు కణికలాంటి అస్తిత్వాన్ని 

ఇంకా రాయలేక పోయినందుకేనేమో 

ఈ లోకం 

ఇంకా నీడల మాటునే  ఒదిగి ఉంది 


ఇదేం సృష్టో యేమో…

బ్రహ్మకింకా  నైపుణ్యం పెరగాల్సి ఉందనిపిస్తుంది 

మరి సరస్వతిని ప్రసన్నం చేసుకోమందామా?





Wednesday, 30 November 2022

ప్రకృతి ప్రణవం


లోకాన్ని గోరువెచ్చగా మేలుకొలుపుతూ 
ఈ ఉదయారుణపు స్పర్శ 
 
పసి పాప నవ్వులాంటి తారలని 
వేలాడదీసుకుంటున్న ఆ రేయి
 
ఏ జ్ఞాపకాలనో మోసుకుంటూ 
బద్ధకంగా ముసురుకుంటున్న 
ఒక ఆకు మెత్తని గాలి 
 
వజ్రాలే  ద్రవరూపమెత్తి నీటి దర్పణమై 
ఆకాశాన్ని ఇముడ్చుకుంటూ సాగిపోతున్నట్లున్న  
ఆ ప్రవాహ గానం 
 
సృష్టి విధానాన్ని నినదిస్తూ 
జంతు జాల పయనం 
 
అంతా  ఒక సవ్వడి…  
ప్రకృతే తనకై  శబ్దించుకుంటున్న 
అనంత ప్రణవపు  ఉరవడి 
 
నీకు తెలియని నీ అహపు రహస్యమది 
ఇదంతా ఇలా ఉంది కాబట్టే 
నువ్విలా ఉన్నావ్ 
 
ఇవేమీ లేకుండా… 
నీకోసమంటూ ఒక్క పలకరింపూ  
మృగ్యమైన చోట 
నీకు నువ్వు దొరకటమన్నది 
సమాధానమిక పుట్టని ప్రశ్న


Friday, 25 November 2022

శిల

 



ప్రతి కన్నీటి బొట్టు 

ఓ రహస్య ప్రపంచపు లోతులని 

పరిచయం చేస్తుంటే 

హృదయపు కదలికలోకి  

ఒక నిశ్చలతని ఆవాహన చేసుకున్నట్లుగా 

ఇక్కడ నా కన్నీటిని 

నిశ్శబ్దం చేసుకున్నాను 


ఎవరికీ పరిచయం లేని 

ఒక మధ్య రాత్రిలో 

నా తలగడే కాగితమయ్యింది… 

పొద్దున్న నిశ్శబ్దమైన 

అశ్రువుని అనువాదం చేయడానికి !


… 


ఎప్పటిలాగానే తెల్లవారింది 

స్పందన లేని కఠిన శిలగా 

నన్ను మేల్కొలుపుతూ 



Thursday, 24 November 2022

గాంధారిత్వం



దీప్త నీలాల కాలం తలుపెప్పుడు తడుతుందోనని 
తమో ముద్రలేసుకుంటూ వస్తున్న నిమిషాల లోతుల్లోకి చూస్తున్నప్పుడు 
గాలి అలలలో  ఈదులాడుతున్న అలజడిని 
ఎవరో గుండెలోకి పోతపోస్తున్న చప్పుడవుతుంటే 
మౌనమంతా మైదానంలో కరిగిపోయి 
రక్త నీలపు సంధ్యారాగమంతా  కంటిమాపుల్లో కంపనమవుతుంది 
 
గరిక వేటుకి గాయపడి నెత్తుటి పారాణి అద్దుకున్న పసిపాదాల క్రింద 
నలిగిపోయిన పచ్చదనాల లెక్కలేస్తూ 
స్మృతినిండా మృతి చెందిన క్షణాల కూడికలేసుకుంటూ 
ఉచ్ఛ్వాస నిశ్వాసల గణనల్లో లోకాన్ని బేరీజువేస్తూ 
గాంధారిత్వపు చూపులతో నిజాలని తూద్దామనుకుంటే 
మొలిచేవన్నీ తిమిరాన్ని పండించే చీకటి విత్తనాలే 
 
గాలిలో వేలాడుతున్న నల్లమబ్బులని చప్పరించి దాహం తీర్చేసుకుందామని 
రెక్కలని చాపుకుంటూ ఎగురుతున్న తెల్లపావురపు ఆశలో భ్రమనే  చూస్తే 
ఆశావాదానికి ప్రతీకలంటూ ఏ మెలకువలోనూ రాయబడి ఉండవు
కాటుకని కప్పుకున్న పసిడి కిరణాలే ముంగిట్లోకి వస్తూ 
ఉన్న ఒక్క జీవిత కాలమూ జీవన్మృతమై సాగిపోతూనే ఉంటుంది..  
మోటబావి నెర్రెల్లోనూ చిగురించే రావి మొక్కకున్న పట్టుదల నేర్వక! 
 
ఇంత తెలిసాక 
జన్మల క్రితమే వలసబోయిన నవ్వులను ఈ బ్రతుకులకి ఆశబెట్టడమంటే 
నిజాన్ని ఏ మడతల్లోనో దాపెట్టి అబద్ధానికి ఆడంబరమద్దటమే కదూ…! 


(అంతర్జాల పత్రిక 'కౌముది' లో మే 2021 లో ప్రచురితం)


Thursday, 26 May 2022

సాయంతనాల వ్యాకరణం





తేనె చుక్కొకటి  గుండెల్లోకి జారి 

సున్నితత్వపు అస్తిత్వాన్నంతా 

మేనిపై మెరుపుగా మలచినట్లు

లాలిత్యపు మంజూషమొకటి 

తననే వ్యాపకంగా మార్చుకుందేమో

మృదుత్వమై అక్కడే ఘనీభవించింది


సాయంతనాల ఎరుపుని కలగలుపుకుని  

తామరాకైన తనువుపై 

ఇంద్రధనస్సులేవో వాలినట్లుగా

పొందికగా సర్దుకున్నట్లు ఉన్నాయి 

తన కనురెప్పల క్రింద కొన్నికలలు... 

కళ్ళలోని కల్మషాన్ని వెల్లవేస్తూ ! 


ఏటి నీలి పూలతో గీసిన నీలోపలాలై 

వెలుగునద్దుకున్న క్రొమ్మెరుగుల కంటిపాపలపై 

పాలపిట్ట రెక్కలపై వచ్చిన గాలి 

అద్దుకొచ్చిన స్నిగ్ధత్వం అంటుకుందేమో 

నవ్వుల పుక్కిలింతలతో 

త్రుళ్ళి త్రుళ్ళి పడుతున్నాయి  


దేహలతగా జీవ వర్ణాలని నింపుకుని 

అడవి పూల పరిమళమేస్తున్న 

చిరుచెమ్మటలే వేలికొనలని తడిచేస్తుంటే 

సురభిళ ఘటికలుగా చిట్లిన 

సమయాలన్నిటిలో కాలూనిన 

నిరతిశయ సొగసు కావ్యమేమో తాను 


కలల కల్లోలమెరుగని కనురెప్పల మీద ఒట్టేసి 

యుగాల తీరాలవతలనుండి పోగుచేసుకున్న  

హేమంతపు ఉషాకిరణాల మెరుపుల్ని అద్దుకుని  

నీలోచనాలతో నిర్మలత్వపు వ్యాకరణాన్ని వచిస్తూ 

తనువంతా జీవాత్మ పరచుకున్న ఉత్కృష్ట రూపమై 

ప్రకృతికి పరిపూర్ణతనిచ్చే కమనీయ కవిత్వం ‘తను’


Sunday, 11 June 2017

The Touch

Do you hear her?
All the time she is telling your story

Whole day she is waiting for you
And tries to exhaust your tiredness
Without moving from where she stood,
She listens to you throughout your daily life
And the world's stories
She hides your secrets from the world

She is the witness for your generations
And gathered breaths of your parents
She kisses your childish foot
And Afterwards,
Witnessed when you become steps for your child’s foot
And she is the witness of your life with your sweetheart

She becomes wet for your tears
And joy of your smiles
She shows you like a mirror
And becomes address for your existence
She conceals you from the world's exasperations
And she is with you even in destruction

Look at her and listen to her
She is craving for a whole-hearted touch

Now, do you hear her?
Yes, true…
She is… Your room

Now… Give affectionate,
Warm touches to her
And then, you can hear
Splashes of holy souls
That enlighten your life