మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Monday, 23 August 2010

మానసం
Sunday, 22 August 2010

తెలుగు తల్లి అంటే ఉలుకు ఎందుకు?

ఎప్పుడు చూసినా టి. ఆర్. యస్ అధ్యక్షులు తెలుగు తల్లి అంటే మంది పడుతూ ఉంటారు. అది ఎందుకో నా మట్టి బుర్రకు ఎప్పుడూ అంతుపట్టదు.
తెలుగు తల్లి అనేది తెలుగు భాషకు మాతృస్తానం ఇచ్చి తెలుగు ప్రజలందరూ గౌరవించు కోవటం అనుకుంటున్నాను. తెలంగాణలో ఉండాల్సింది తెలుగు తల్లి కాదు తెలంగాణా తల్లి అనటం ఏమిటో దానికి తెలంగాణా మేధావులు వంతపాడటం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు. తెలంగాణా కావాలనుకునే వారి ఆకాంక్ష ను నేను తప్పు పట్టటం లేదు. తెలంగాణా, కోస్తాంధ్ర, రాయల సీమ అనేవి త్రిలింగ దేశం లోని వివిధ ప్రాంతాలకు ప్రతిరూపం గా చెప్పుకునే పేర్లు. కానీ తెలుగు అనేది ఈ మూడు ప్రాంతాల ప్రజలు మాట్లాడుకునే భాష. మాండలికాలు, యాసలు వేరు అయినంత మాత్రాన మాతృభాష మారదుగా.
తెలుగు తల్లి అనేది తెలుగు ప్రజలందరికి తల్లే కదా? తెలంగాణా లోని భాష తెలుగు కాదా? ఆంధ్ర తల్లి అనో సీమ తల్లి అనో అని ఎవరన్నా అంటే అప్పుడు తెలంగాణా తల్లి అనే వాదన తీసుకు రావటం లో అర్ధం ఉంటుంది.
భాషకు మాతృస్తానం ఇచ్చి నప్పుడు ఏ ప్రాంతం వారు అయినా దాన్ని వ్యతిరేకించటం అర్ధ రహితం. తెలంగాణా కావాలనుకునే ఆకాంక్ష కోసం తెలుగు భాషను చిన్నబుచ్చ వద్దు.


మీ

స్నేహితుడు


(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

Saturday, 21 August 2010

హీరోలు మాత్రమే దోషులా?

టాలీవుడ్ హీరోల్లో ఎవరెవరు డ్రగ్స్ కేసు ల్లో ఇరుక్కున్నారో ఇరుక్కో బోతున్నారో అంటూ మీడియా అంతా హోరెత్తి పోతుంది. నిజం గా డ్రగ్స్ వాడటం తప్పే కాదనలేం. సినిమా హీరోలు హీరోయిన్ లు అందరూ నిజజీవితం లో కూడా హీరోల్లా ఉండరనేది వర్తమాన భారతం లో జనమెరిగిన సత్యం.

సెలెబ్రిటీల వార్తలంటే ప్రజానీకానికి ఆసక్తి ఎక్కువ కాబట్టి మీడియా దృష్టి అంతా వీళ్ళ మీదే ఉంచి, ఈ సమస్య మూలాల మీద ఫోకస్ తక్కువ పెడుతున్నారు.

కొకైన్ ఎవరు కొంటున్నారు అనేదానికన్నా, అసలు కొకైన్ ఇండియా లోకి ఎలా వస్తుంది? సముద్ర మార్గం ద్వారానా? వాయు మార్గం ద్వారానా? ఏ మార్గం ద్వారా వచ్చినా కస్టమ్స్ అధికారులు ఏం చేస్తున్నారు.?

కస్టమ్స్ అధికారుల కళ్ళు గప్పి ఇండియా లోకి వచ్చాక కూడా వివిధ నగరాలకు ఎలా చేరవేయ గలుగుతున్నారు. నిఘా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు?

ప్రతిపక్షాల వ్యవహారాల మీద, స్వపక్షం లో తోక ఝాడించే వారిమీద నిఘా పెట్టటానికే అధికారులను ఉపయోగించుకుంటున్నదా అధికార పక్షం. ?

మన దేశ మాజీ రాష్ట్రపతి నే బట్టలు విప్పి చెక్ చేసారట వేరే దేశపు అధికారులు. గోద్రాలో మతకల్లోలాలకి భాధ్యుడిని చేసే ఒక రాష్ట్ర ముఖ్య మంత్రికే వీసా మంజూరు చెయ్యలేదు అదే దేశం.

మరి మనం? మన దేశం లోకి వచ్చే దెవరో .. వారు వెళ్ళారో లేదో... తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం.

విదేశీయులు విజిటింగ్ వీసా మీద వచ్చి ఏళ్లకేళ్ళు మనదేశం లో పాతుకు పోతుంటే అధికార యంత్రాగం ఏం చేస్తున్నట్లు. ?

అసలు విజిటింగ్ వీసాల మీద వచ్చి గడువు లోపల దేశం విడవని వారి వివరాలు & ఫోటోలు అన్ని రాష్టాల పోలీసు యంత్రాగానికి అందించి అలాంటి ఎలుకల్ని కలుగుల్లో నుండి బయటకు ఎందుకు రప్పించరు.?

ఇలాంటి వాళ్ళే నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగిస్తున్నారు. వేలాది మంది విజిటింగ్ వీసాల మీద, ఇరుగు పొరుగు దేశాల నుండి తప్పుడు వీసాల మీద వచ్చి పాత నగరం లో పాతుకు పోయి దేశాన్ని నాశనం చేస్తున్నారు.

పొరుగు దేశాల నిఘా వర్గాలు దొంగ నోట్లు ముద్రించి మన దేశం లో వాటిని చెలామణి చేసి మన ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నసంగతి తెలిసీ వాటిని నిరోధించలేని మన నిఘా వ్యవస్తని సంస్కరిస్తే దేశానికి ఎన్నో ఇక్కట్లు తొలగి పోతాయి.

ఇంటలిజెన్స్ వర్గాలని అధికార పక్షాలు తమ ఇంటి పాలేరులుగా వాడుకూవటం మానేసి దేశం లో అసాంఘిక శక్తుల మీద నిఘా పెంచితే బాగుంటుంది.

కనీసం మీడియా తమ ప్రయత్నం గా ఇలాంటి విషయాల మీద చొరవ చేస్తే బాగుండు.

రాజ్ భవన్ లో మాజీ గవర్నర్ శృంగార లీలల మీద కాదు స్టింగ్ ఆపరేషన్ లు చెయ్యాల్సింది. దేశం లో యువశక్తిని నిర్వీర్యం చేసే వర్గాలను బయట పెట్టె స్టింగ్ ఆపరేషన్ లు కావాలి.

అలా చెయ్యబోయే తొలి జర్నలిస్ట్ కి ఇప్పుడే చేస్తున్నా పాదాభి వందనం.

మీస్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)