Sunday, 22 August 2010

తెలుగు తల్లి అంటే ఉలుకు ఎందుకు?

ఎప్పుడు చూసినా టి. ఆర్. యస్ అధ్యక్షులు తెలుగు తల్లి అంటే మంది పడుతూ ఉంటారు. అది ఎందుకో నా మట్టి బుర్రకు ఎప్పుడూ అంతుపట్టదు.
తెలుగు తల్లి అనేది తెలుగు భాషకు మాతృస్తానం ఇచ్చి తెలుగు ప్రజలందరూ గౌరవించు కోవటం అనుకుంటున్నాను. తెలంగాణలో ఉండాల్సింది తెలుగు తల్లి కాదు తెలంగాణా తల్లి అనటం ఏమిటో దానికి తెలంగాణా మేధావులు వంతపాడటం ఏమిటో నాకు అర్ధం కావటం లేదు. తెలంగాణా కావాలనుకునే వారి ఆకాంక్ష ను నేను తప్పు పట్టటం లేదు. తెలంగాణా, కోస్తాంధ్ర, రాయల సీమ అనేవి త్రిలింగ దేశం లోని వివిధ ప్రాంతాలకు ప్రతిరూపం గా చెప్పుకునే పేర్లు. కానీ తెలుగు అనేది ఈ మూడు ప్రాంతాల ప్రజలు మాట్లాడుకునే భాష. మాండలికాలు, యాసలు వేరు అయినంత మాత్రాన మాతృభాష మారదుగా.
తెలుగు తల్లి అనేది తెలుగు ప్రజలందరికి తల్లే కదా? తెలంగాణా లోని భాష తెలుగు కాదా? ఆంధ్ర తల్లి అనో సీమ తల్లి అనో అని ఎవరన్నా అంటే అప్పుడు తెలంగాణా తల్లి అనే వాదన తీసుకు రావటం లో అర్ధం ఉంటుంది.
భాషకు మాతృస్తానం ఇచ్చి నప్పుడు ఏ ప్రాంతం వారు అయినా దాన్ని వ్యతిరేకించటం అర్ధ రహితం. తెలంగాణా కావాలనుకునే ఆకాంక్ష కోసం తెలుగు భాషను చిన్నబుచ్చ వద్దు.


మీ

స్నేహితుడు


(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

9 comments:

తెలుగు అనేది ఒక భాష అని, తెలంగాణా అనేది ఒక ప్రాంతమని ఈ మేధావులకి నిజంగానే తెలియదంటారా? బాగా రాశారు.

ఒకే తల్లి బిడ్డలు ... అన్నా తమ్ముల మధ్య అభివృద్ధి లో తేదాలెందుకున్నాయబ్బా ... తెలంగాణా పది జిల్లాలలో తొమ్మిది జిల్లాలు వెనకబడిన లిస్టు లో ఎందుకున్నాయబ్బా ? కేంద్రం ప్రకటించిన లిస్టులో విషయం ఇది...

కడుపు నింపని తల్లి ని వదిలి ..కడుపు నింపే తల్లికి జై కొట్టడం కాదా ?

@కృత,

నేనేమీ తెలంగాణా వెనక బడలేదు అని వాదించలేదు... పూర్తిగా మళ్ళీ చదవండి... భాష పరం గా తల్లి అనే పదం వాడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఏదో ఒక్క ప్రాంతానికి తెలుగు తల్లిని ఎలా పరిమితం చేస్తారు?

నేను చెప్పాను ఆంధ్ర తల్లీ అనో... సీమ తల్లి అనో అంటే వ్యతిరేకించటం లో అర్ధం ఉంది. అయినా భావనల్లో తప్ప నిజ జీవితం లో లేని తెలుగు తల్లి మీద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు తెరాస వారు?

ఒక్కటి చెప్పండి తెలంగాణా మాతృభాష ఏమిటి?

అయ్యా స్నేహితుడు గారు, తెలంగాణా మాతృ భాష, "తెలంగాణా", అది మీకు తెలియదంటే, కేవలం మీరు ఆంధ్రోళ్ల కుట్ర పుస్తకాలు చదవటం వలనే!!

ఆ భాషకు పునాదులు మా దొర మాట్లాడే బూతులు, వ్యాకరణం లాంటివి కావాలంటే, దొరను మాత్రమే తెలంగాణా భవన్ లో అడగాల, సంఝయ్యందా?

మీరు అనే తెలుగు భాషకు ఎంతో సేవ చేసిన తెలంగాణా పండితులు, ఆ భాష నేర్చుకోవటానికి మా దొర మెచ్చిన మంచి ప్రభువు నిజాం గారు కుదరదు అన్నా, ఆ భాష మీద మక్కువతో, ఆ భాష నేర్చుకొన్న తెలంగాణా పండితులు, దానికోసం ఎంతో పాటుపడిన తెలంగాణా జనతా అంతా తెలంగాణా ద్రోహులు, కావాలంటే మా దొర గారి బాంచన్ లను అడుగుండ్రి. అదీ కుదరదు, తెలంగాణా భాష నేర్చుకోవాలంటే ఇదిగో మా తెలంగాణా భాషా పందితులు (అచ్చుతప్పు కాదు) ఇస్తున్న sample class. ఇంకా కావాలంటే మీరు తెలంగాణా భవన్ కు వెళ్లి అక్కడ ఇస్పెషల్ క్లాస్లు లలో జేరాల మరి.

http://www.youtube.com/watch?v=m3bza5I3n5Ufeature=related

మాతృ భాష అని మొత్తానికే తల్లిని చేస్తే (కేవలం భాషని చూసి ప్రాంతాన్ని కలుపుకుంటే ) ఒక ప్రాంతం (ఒక బిడ్డ ?) ఎండిపోతోంది ..... నిజజీవితం లో లేదు కదా .. అందుకే సరైన భావన కి రూపం ఇచ్చుకున్నాం ... పేరులో ఏముంది ... ఏమీ లేదు ..కాని ఆ పేరు ని ఉపయోగించి రాజకీయాలు చేసే వారి ఆలోచనల్లో ఉన్నాయి కుట్రలు.. సామాన్యులకి ఈ తెలుగు అనే భావన పోరాటానికి అడ్డురాకుండా ఉండేందుకే తెలంగాణా తల్లి పుట్టింది ....

@ స్నేహితుడు
ఇందులో అర్థం కానిదేముంది? ...
రాష్ట్ర విభజన నేపథ్యంలో ... ఇది ఆస్తి పంపకాల గొడవ.
ఒక స్థిరాస్తి 400 ఏళ్ళుగా తమ్ముడిది. 50 ఏళ్ళ కింద ఉమ్మడి కుటుంబంలో చేరిన అన్న ఆ అస్తిని వాళ్ళ తల్లి పేరిట power of atorney చేయించి ఆధిపత్యం చెలాయిస్తూ, దాన్ని శాశ్వతంగా ఆమె పేరునే registration చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు తమ్ముడు వేరు పడి ఆ power of atorney ని రద్దు చేయాలంటున్నాడు. తమ్ముడి పేరునే registration ఉంటే, వేరుపడినప్పుడు అది తమ్మునికే చెందుతుంది. తల్లి పేరున registration ఉంటే, వేరు పడినప్పుడు అది ఇద్దరికీ చెందుతుంది. అది తమ్ముడెలా ఒప్పుకొంటాడు? ... అంతేగాని ... తల్లిపై ద్వేషం ఎందుకు ఉంటుంది? ఇటువంటి సందర్భాలలో ... తనకు న్యాయం జరిగేలా చూడడం లేదన్న బాధతో చిన్న కొడుకు తల్లికి అక్షింతలు వేయడం మామూలే !

Na varaku meeru cheppindi nijame anipinchindi kani pina comments anni chadivaka...naku oka china sandeham?sandeham matrame suma!!!!
Telangana verupadali annaru bane undi.Andhra vallu vachi telangana ni dochukuntaru leda vala udyogaalu anni tesukuntunaru anedi oka karanam ani antunaru.Maree Pina comments pettina vallalo enta mandi ikkadiki vachi vella udyogallu tesukovatledhu????ikkada kani tappu akkada atappu ayindha?

gala gala godaari Pongiporlutuntenu.. birabira Krishnamma Parugulidutuntenu.... Bangaru Pantale Pandutayi. Muripala Mutyalu Dorlutayi. Bangaru Pantalu.. Mutyalu... Ekkada pandutunnayo Andarikee telusu.. Anduke aa Telugu talli Maakoddu.. Telangana Talle muddu. Telugu Bhashapi Maakunna Abhimaananni Meeru Prashninchoddu.

Post a Comment