Wednesday, 19 February 2020

ప్రహేళిక

ఇక్కడెందుకో 
నా నడక నిశ్శబ్దమయ్యింది

విరిగి పడుతున్న నీడలని చదవటానికే 
అది తోడుగా  వస్తుందని 
లోపలి స్వరమేదో గుసగుసలాడుతుంది 

ఈ క్షణమెందుకో  
నా జీవితమంత పొడుగై  ఉంటుందనిపిస్తుంది 

కొన్ని నిగూఢతల ప్రహేళికల చిక్కులు వీడటానికి  
ఆ మాత్రం సమయం  పడుతుందని 
గుండె పొలిమేరల్లో తచ్చాడుతున్న తడి చెప్పింది 

***

హ్మ్…. 
కల చెదిరింది 
నిశ్శబ్దం ఇంకా 
కొనసాగుతూనే ఉంది   

మరి 
అసలు కలెందుకు  శబ్దం చేసిందో ! 



0 comments:

Post a Comment