ఎవరో బహిష్కరించిన పాటను
నేను పాడినప్పుడు
ఆ పాట మనసారా
నన్ను తనలోకి లీనం చేసేసుకుంది
తన అంతరాలలోకి చేరాకే తెలిసింది
తాను బహిష్కరింపబడ్డప్పుడల్లా
ఒక కొత్త ఉదయాన్ని కలగంటుందని
ఒక కొత్త గొంతుకని పుట్టిస్తుందని
0 comments:
Post a Comment