Wednesday, 1 November 2023

ప్రశ్న

 




ఇక్కడ శబ్దమొకటి నిశ్శబ్దంగా ఖాళీ అవుతుంది 

బహుశా ఒంటరితనమేదో పుడుతున్నట్లుంది

తెలిసిన కాలాన్నంతా 

తెలియని ఉప్పెనేదో కమ్మేసినట్లనిపిస్తుంటే 

కను రెప్పల కింద కొత్త కాలం దొరుకుతుందేమోనని 

ముఖం వెలివేస్తున్న దుఃఖాలన్నీ పోగుపడితే 

మనసెందుకు రాయిగా మారుతుందన్న ప్రశ్నని 

చదవగలిగే నీలి వెలుగు దొరకకేమో 

సమాధానమింకా ప్రశ్నని వెతుక్కుంటూనే ఉంది.!!! 


0 comments:

Post a Comment