Thursday, 7 January 2010

మనం మనుషులమా గొర్రెల మందల్లో గొర్రెలమా?


దాదాపు గత రెండు నెలలు గా మన రాష్త్రం లో జరుగుతున్న పరిణామాలు, వాటి పై కొంతమంది జనం స్పందిస్తున్న తీరు చూస్తుంటే పై అనుమానం రాక మానటం లేదు.

ఏమిటీ గత కొంత కాలం గా మనకీ మంట?.

తెలుగుజాతి కి ఏదో పీడ పట్టినట్లు మనలో మనమే కొట్టుకోవడం.

పాకిస్తాన్ ఇండియా సైనికుల్లా , కాలికి కత్తి కట్టిన పందెం కోళ్ళలాగా రెండువర్గాలు గా మనం విడిపోయి కొట్టుకొంటుంటే ఏదో రిఫరీ లా ఆ అరవ చిదంబరం గారు ఉన్నట్లు ఉన్నారు.

జై తెలంగాణా అన్న నాయకుల సంబంధీకులు కానీ, జై సమైఖ్యాంధ్ర అనే నాయకుల బంధుగణం లో కానీ ఎవరైనా ఆత్మాహుతి చేసుకున్నారా. సామాన్య జనం తప్ప. వాళ్ళు జై అని మాత్రమే అంటారు తమ రాజకీయ పునాదులు ఆ నినాదాల్లో తవ్వులుని ఉంటారు కాబట్టి. కానీ మనం మాత్రం గొర్రెల మందల్లా జై జై అంటూ ఆత్మార్పణం చేసుకుంటూ ఉంటాం. ఆ ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తుల కుటుంబాలు పడే క్షోభని ఈ రాజకీయ నాయకులు, విద్యాలయాల్లో చదువులు చెప్పటం మాని ఉద్యమాలు ఎలా చెయ్యాలో చెప్పే అధ్యాపకులు తీర్చగలరా?

మన ఆస్తులు మనమే నాశనం చేసుకుని మనం బాపుకున్నదేమిటి. బస్సు చార్జీల మోత తప్ప. రవాణా చార్జీల పెంపు ఒక్కటి చాలు మనలాంటి సామాన్యుల జీవితాలని అస్తవ్యస్తం చెయ్యటానికి. ఎందుకంటే మనం ఉపయోగించే ప్రతి వస్తువు ఖరీదులోనూ రవాణ చార్జీ మిళితం అయి ఉంటుంది కాబట్టి.

ఈ రోజున ప్రభుత్వాన్ని మనం గట్టిగా నిలదీయగలిగే నైతికత మనలో ఉందా.? ప్రభుత్వ ఆస్తి అంతే పౌరుల ఆస్తే కదా. మన ఆస్తి మనమే నాశనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏమని అడగగలం.

ఉద్యమాల ముసుగులో అరాచక శక్తులకు ఊతం ఇవ్వడం తప్ప ఇంతవరకూ ఎవరికి అయినా ఒరిగింది ఏమిటి.? గొర్రెల మందల్లో గొర్రెల్లా ముందున్న వాడిని అనుసరించి మన జీవితాలని నాశనం చేసుకోవటం తప్ప?మీ
స్నేహితుడు

(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)

3 comments:

"పాకిస్తాన్ ఇండియా సైనికుల్లా , కాలికి కత్తి కట్టిన పందెం కోళ్ళలాగా రెండువర్గాలు గా మనం విడిపోయి కొట్టుకొంటుంటే ఏదో రిఫరీ లా ఆ అరవ చిదంబరం గారు ఉన్నట్లు ఉన్నారు. "

అక్కడ అంతేమి జరగలేదు. మీడియా వాళ్లు కనపడ్డప్పుడు, రాజకీయ పార్టీల కార్యకర్తలు కొంచం హడావుడి చేశారు తప్పితే, రెండు ప్రాంతాలలో సాదారణ ప్రజానీకం ప్రశాంతంగానే ఉన్నారు.

కుప్పలుగా ఉన్న చానళ్లు ఏమి చెయ్యాలో తెలియక జరిగిన దాన్నే ఊదరగొడుతూ చెప్పారు. వీటి గురించి ఆలోచించడం అనవరం.

aa gorrello manam lemu kada aina manani thallato katti vallato lakku pothunnaru em cheddam mee avedana na avedana lagane vundi

చిదంబరం ఈ దేశానికి హోం మినిస్టర్ ...బేదాలు యెమైనా వుంటే వేరే విష్యం గానీ ఆయ్యన్ని గౌరవించడం మన విధి

Post a Comment