సాగర మధ్యంలో
అరవిరిసిన ప్రకృతి అందాలు చిందే అందాల దీవిలో నీవు నేను జంటగా ఆకుల్లో ఆకులమై, తీగల్లో
తీగలమై ఒక్కటవ్వాలనీ సెలయేటి గలగలల్లో మన ప్రేమ సవ్వడి కలసిఫోవాలనీ, లేడి
కూనలూ... కుందేటి పిల్లల మధ్య మనమిద్దరం దాగుడు మూతలాడాలనీ... ఎన్నో... ఎన్నెన్నో
కోరికలు.
ఎవరబ్బా ఈ
అపురూప లావణ్య సౌందర్య రాశి అని ఆత్రంగా జలతారు పరదాలను అడ్డుతీసి
చూశాను. ఆమె ఎవరో తెలుసా?
రోజూ కలలో కొచ్చి నన్ను కవ్విస్తున్న ఆ కన్యకా మణి... నా ఊహలలో ఊయలూగుతున్న నా
ఊహా ఊర్వశి వైన నీవే...
ప్రతిరోజు ఒక
కల... అదేమిటో తెలుసా...
పసిడి
పల్లకిని మోయుచున్న బోయీలు,
ఆ పల్లకిలో బంగారు జలతారు పరదాల మాటున ఓ అపూర్వ లావణ్య సౌందర్యరాశి, దేవలోకం
నుండి దిగి భువికి ఏతెంచిన దేవకన్యలా... ఇంద్ర సభలో నర్తిస్తున్న అప్సరాంగనలా...
గంధర్వ రాజుపై అలిగి భూమికి దిగివచ్చిన గంధర్వ బాలలా... యక్షిణీ కన్యలా ఓ ముగ్ధ
మనోహర సౌందర్య రాశి ఈ దీనుణ్ణి చూసి చల్లగా... మనోహరంగా నవ్వింది. కొంటెగా కన్ను
గీటింది.
అవును నిజం గా నీవే ఆ పల్లకిలోని అపూర్వ సౌందర్య రాశివి.
రోజూ
ఉదయాన్నే తుషార బిందువులు నీ జలతారు మేనిపై పడి నీ సాన్నిధ్యంలో కరిగి ఆవిరి
అవుతాయి. ఆ మంచు బిందువుల పాటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో కదా...
నీ శిగలో
తురిమిన మల్లెల పాటి భాగ్యం కలగాలంటే నేను కూడా మల్లెనై నీ శిగలో చేరాలని ఉంది.
నువ్వు వేసుకునే ప్రతి వలువా నేనే కావాలనీ...
ఎప్పుడూ నీ సాన్నిధ్యంలో గడపాలని నా చిరు కోరిక. ఘల్లు ఘల్లుమనే నీ కాలి అందియల
పాటి భాగ్యం నాకు లేదా...
`నీ మనసు పాడే మౌనగీతంలో ఓ అర్ధవంతమైన నిశ్శబ్దపు
చరణం. డానికి ఓ అందమైన పల్లవిగా నేను మారాలి. ఆందుకు నేనేం చెయ్యాలి. శెలవియ్యవా
ప్రియతమా?’







2 comments:
Last lines are nice.
Thank you padmarpita garoo
Post a Comment