ఆరుబయలు పచ్చిక మీద
వెన్ను వాల్చి
ఆకాశాన్ని వెలిగిస్తున్న నక్షత్రాలకి
ఒక చిన్న కబురు పంపుదామని చూస్తే
బయటున్న చీకటంతా
కళ్ళల్లో మేటవేసుకుని ఉంది
ఆకాశాన ఆ నక్షత్రాలని ఊడ్చి వేస్తూ
ఇప్పుడు బయటేమో ఒకటే కాంతి వాన
కాంతి జల్లు ఎక్కువయిందనుకుంటా
ప్రకృతి వర్ణం తెలుపు చీకటిని కప్పేసుకుంది
అయినా పర్లేదులే….
పడకగది పైకప్పుకి
అతికించబడ్డ చీకట్లో
దాచిపెట్టుకున్నాం గా
కాగితపు నక్షత్రాల నవ్వులని
మరి గర్వంగా తల ఎగరేద్దాం







0 comments:
Post a Comment