Thursday, 13 June 2019

కిటికీ !

వాన గాలి లోపలికి రాకుండా
కిటికీ తలుపులని అడ్డు పెట్టటం నేర్చుకున్నామని
గుండె తడి కంటిని తడపకుండా
గుండెకీ కంటికీ మధ్య
కిటికీ ఒకటి కావాలనుకోవటంలో
తప్పేమీ లేదు

అయితే
అసలు గుండెందుకు తడుస్తుందో చూడటానికి
ఒక్క దీపం వెలిగించటంలోనే
దిగులు ఆవిరవ్వటం అనుభవమవుతుందని  

ఏ ప్రార్థనలో నుండి వినవస్తుందో మరి !



1 comments:

చాలా బావుంది సురేష్ గారు

Post a Comment