ఈ రోజు ఈనాడు పేపర్లో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మీద కార్టూనిస్ట్ శ్రీధర్ వేసిన కార్టూన్ కొంతమందికి
అభ్యంతరకరంగా అనిపించిందట. ఆ కార్టూన్ ఒక వయోవృద్ధుడి అనారోగ్యం మీద వేసిన
కార్టూన్ అని వారి భావన.
రోశయ్య గారు వయో
వృద్దులు మాత్రమే అయి ఉంటే శ్రీధర్ ఆ కార్టూన్ వేస్తే అభ్యంతరకరం ఏమో కానీ
రాష్ట్రాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి తరచూ అనారోగ్యం బారిన పడుతున్నప్పుడు ఆ
కార్టూన్ లో అభ్యంతరం ఏముంది.
అది ముఖ్యమంత్రి
అనారోగ్యం మీద వేసిన కార్టూన్ గా మాత్రమే నాకు అర్ధం అయ్యింది కానీ ఒక వృద్ధుడిని
అపహాస్యం చేసిన కుసంస్కారం అందులో నాకు కనిపించలేదు.
దశాబ్దాల తరువాత ఒక
మంచి ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, తమ పార్టీ మహానాయకుడు గతించి
ఏడాది గతించిన సందర్భంగా అంజలి ఘటించటానికి సహకరించని ఆరోగ్యం మన ముఖ్యమంత్రి ది.
పెద్దవాళ్ళ
అనుభవాన్ని ఉపయోగించుకోవటం చాలా అవసరమే కానీ అది అనుక్షణం ఆటుపోట్లు
ఎదుర్కోవాల్సిన పదవుల్లో కూర్చోబెట్టి మాత్రం కాదు.
మామూలు ఉద్యోగులు
58/60 సంవత్సరాల వయసు దాటితే ప్రభుత్వానికి పనికి రారు కానీ 75/80 సంవత్సరాలు
దాటిన,
నిలబడితే కూర్చోలేని, కూర్చుంటే నిలబడలేని
వృద్ధనాయకులు మాత్రం బాగా పనిచెయ్యగలరట. రాజకీయ నాయకులకు వాళ్ళు చనిపోయినప్పుడు
కానీ రిటైర్మెంట్ రాదు.
అయినా
రాజకీయాల్లో యాభై ఏళ్ల వాళ్ళని యువ నాయకులుగా భావించే మన దేశం లో 90 ఏళ్లు
వచ్చినా అది పెద్ద వయసు
అనిపించదు కదా.... ఏమంటారు?
మీ
స్నేహితుడు






















