మానసం

అక్షర స్పర్శ

మానసం

భావ సంవేదనం

మానసం

మౌన భాష్యం

మానసం

వాక్య శిల్పం

మానసం

నిశ్శబ్దఘర్షణ

Saturday, 11 February 2023

Reflections

 



As I am discovering my newness in antiquity, 

Looking at my impressions on the winds, 

That found rest on leaves of yore, 

I see myself as a new leaf, 

Inserted into ancient history.


The thirst that's quenched, the footsteps that find a path, 

Are all like a dream that has passed.

I listen to the wilted flower rustle, 

While remembering the sweat of new thirst, 

Realising that I myself am part of it.


I have gained knowledge that was once impossible, 

Of the distant secrets that lie in the past, 

Through endless pursuit and perseverance, 

I am able to realise the truth.


As night becomes day and day becomes night, 

Truth changes its form and appears in a new light.

Friday, 10 February 2023

Echoes of the Heart

 



Oh, Messenger of mine,

From the depths of sorrow and pain,

You've emptied my soul, made it barren and vain,

Left me to wander, lost in the rain.

 

In the heat of battles untold,

My heart yearns for your embrace,

As the night sets, my soul grows cold,

And my mind is filled with your grace.

 

The echoes of our past still linger,

In the whispers of winds that roam,

My heart aches with the pain they bring her,

And my soul longs for you alone.

 

The future is yet to be seen,

But I trust in your guiding hand,

With you by my side, my heart is serene,

In your embrace, I am a happy man.

 

Your words are a balm to my weary soul,

How I long to feel your touch,

For in your presence, I am whole,

And in your love, I find solace so much.

 

Oh, how I've missed your tender gaze,

The warmth of your embrace so divine,

For in your love, I find peace and grace,

And in your arms, I am forever thine.

 


Monday, 2 January 2023

తడి ప్రేమలేఖ

 



కనుల నీలిమలో  కరిగిపోతున్న విశ్వరూపంలా 

కనుపాపని కాల్చి వేస్తున్న  నిప్పురవ్వలా 

కంటి సీమని ముంచి వేస్తున్న  తేమ పాతంలా 

కనుదోయి మాగాణిలో మొలకెత్తుతున్న నీటి విత్తులా 

కంటి ద్వారాల మాటున దాగిన శూన్యాన్ని పరిపాలిస్తున్న అశ్రు ధీరలా 

కను రేకల పత్రాలపై లిఖించిన తడి ప్రేమలేఖలా 

కాలమంతా  కనురెప్పల కావలిలో  

సంచరిస్తున్న స్వప్నాలని సంహరించే  వధ్యశిలలా 


ఇదిగో ఇలా…   


కంటిని అంటిపెట్టుకున్న యుగయుగాల బాసలా 

ఎప్పటికీ మరణం లేని ఒకే ఒక్క భాషలా  

కల పగిలినప్పుడల్లా  

ఒక కన్నీటి చుక్క!!! 



Sunday, 1 January 2023

బ్రహ్మత్వపు ఆచూకీ




సముద్రంలోని నీలమంతా ఘనీభవించి 

గుండెలోతుల్లోకి చేరిన ప్రతిపిలుపులా 

చిక్కని నీలి వెన్నెల కాంతి  పరచుకున్న 

మైదానం  నుండి మొదలై  

ఊపిరి మొదలవ్వక ముందే 

మనకోసం విశ్వాన్ని సిద్ధం చేసిన 

బ్రహ్మత్వపు ఆచూకీగా  

గడ్డిపూల రేకల మీద చలిని

వెచ్చగా మనసు లోకి లాక్కొని వచ్చే 

పాదమే  పథమై 

సూరీడి ఎండతునకలని చల్లగా కప్పుకునే

ఇలాంటి నవ్వులు  ఓ నాలుగు చాలవూ

మనల్ని మనం 

యథా తథంగా  అనువదించుకోవడానికీ


Friday, 23 December 2022

అక్షయం

 


అదిగో… 

అప్పుడొకసారి ఓ మిణుగురుల  పొద  

కాస్తంత కాంతి ధూపాన్ని విసిరి వెళుతూ  

ఇలా  చెప్పింది 


గాలంటే 

ఎప్పటి స్పర్శను  అప్పుడే 

ఎక్కడి స్పర్శని అక్కడే 

పరదాలుగా  కప్పే  అనుభూతి  అక్షరమనీ … 

నిప్పురవ్వని దాచుకున్న మంచు ముద్దలా

తనకోసమంటూ ఒక రోజును 

ఏ సీతాకోక రెక్కల కిందనో దాచుకుని 

ఇప్పటికిలా  జీవ ఇంధనమై 

నీకూ… నాకూ… తనకూ… ఊపిరిస్తుందనీ  


***


ఏ  ఔషధీ అరణ్యాల నుండో  

తనని తాను నింపు కొచ్చి 

కొన్ని ఊపిరుల స్పర్శ కోసం 

అన్ని అస్తిత్వాల సాంద్రతని  నింపుకుని 

తనని తాను  ఉగ్గబట్టుకుంటూ 

ఈ గాలి చేసే జాగరణ ఉంది చూశావూ… 

అది కొన్ని స్వప్నాలని 

యదార్థ స్థిరత్వంలోకి 

లాక్కొని వచ్చే తపన!


*** 


ఏ మొహమాటాలకు పోయిందో ఏమో  

ఇప్పుడిలా 

కాస్తంత రంగుల వాసనల రుచిలో  

చిక్కుకుని పోయింది   


నువ్వు కొద్దిగా మేల్కొంటే…

ఏ రంగూ రుచీ వాసనా లేని  

తన యదార్థాన్ని తనకిచ్చేసి 

రేపటి మన శ్వాసల పచ్చదనానికై 

కాస్తంత  ఊపిరి పోసుకుందాం !


(ఈమాట అంతర్జాల పత్రిక డిసెంబర్ 2022 లో ప్రచురితం)

Saturday, 17 December 2022

కన్నీటి పతాకం

 



మనమెప్పుడూ బాటలం

ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ 

చిన్న చినుకులకే చిధ్రమవుతూ 

చిత్ర విచిత్రమైన నడకల్ని భరిస్తూ 


వాళ్లెప్పుడూ వాహనాలే  

ఎండైనా… వానైనా 

తమకి నచ్చిన వేగంతో నడుస్తూ 

అలసట వచ్చిన చోట ఆగుతూ 

రహదారిని  తమ హక్కుగా చేసుకుంటూ !


ఎంతైనా 

పన్ను కట్టిన వాడికే 

దారిమీద హక్కుంటుందంటారు కదా 


మనమెప్పుడూ పాపాలం 

వారివేమో పవిత్రాత్మలు 

అంతేగా మరి… 

బతుకే బతుకులో ఏ  అర్థమూ లేక 

మన దేహాలు 

నడిచే సజీవ సమాధులైతే 

వారి దేహాలేమో 

మన పాపాలని గ్రుక్కిట పడుతూ 

మన బ్రతుకుల మీద 

ముక్తిని ధృవీకరించే వ్యాకరణాలు 


మన అభిప్రాయాల వ్యక్తీకరణలన్నీ 

వారి అధికారపు నిర్ణయాల మాటున   

విధిగా  చల్లబడుతుంటే 

మనం పూసే విషాదాల  మీద 

వారు చిరునవ్వులుగా విరబూస్తారు

***


అవును… 

లోకధర్మమింతే 

తమని తాము ఎక్కువ సమానంగా 

శాసనాలు రాసుకున్నాక 

మనం రాసే దిగుళ్ళకి కార్చే కన్నీళ్ళకి 

అందే  లెక్క ఒక్కటే 

కొన్ని జన్మలు అవనతం కాని  కన్నీళ్ల పతాకాలు అని


(Published in 01.12.2022 Saranga Magazine)

Tuesday, 6 December 2022

ముగింపు లేని వాక్యం

 



అవును…

నువ్వన్నట్లుగా 

ఆదీ నువ్వే…  అంతమూ నువ్వే కావచ్చు 

ఆదికీ అంతానికి మధ్యన నేను ఉన్నాను 

దారి ఉండనీ లేకపోనీ 

నా అడుగులు ఈ నేలనే ముద్దాడుతున్నాయి  


నీకు నేను తెలియక పోవచ్చు 

కానీ నా ఉనికి నాకు అందుతూనే ఉంది 

నా ఊపిరి సాగినంత మేరా 

నా ఉనికి వ్యాపితమయ్యే ఉంది 


నువ్వనుకున్నట్లుగానే 

నాకు ఏమీ తెలియక పోవచ్చు 

నువ్వు ఎక్కిన ఎత్తులు నాకు అందక పోవచ్చు 

నువ్వు చూసిన లోతులు నాకు  తెలియకపోవచ్చు 

నువ్వెళ్ళగలిగే ఏ చోటికీ నేను వెళ్ళలేక పోవచ్చు 


అయితేనేం… 

నా ఏమీ తెలియనితనమే 

కనిపించిన ప్రతి దాన్నీ శోధిస్తూ 

నాలో ప్రశ్నలు పుట్టిస్తుంది 

ఒక ముగింపు లేని వాక్యంలోకి నిన్ను లాగుతూ  

నీ అస్తిత్వపు ఉనికికే ముప్పుటిల్లేలా


Monday, 5 December 2022

బ్రహ్మ లేఖనం...

 



నివురు క్రింద  దాయబడిన 

నిప్పుకణికల ఉనికంతా 

బూడిదగా పేరుకుపోతున్న  

మహా నిశ్శబ్దంలో 

చిక్కుబడినట్లుంది 

బ్రహ్మ లేఖనం... 


ఏ ఆరడిలోని ఇమడని  

నిప్పు కణికలాంటి అస్తిత్వాన్ని 

ఇంకా రాయలేక పోయినందుకేనేమో 

ఈ లోకం 

ఇంకా నీడల మాటునే  ఒదిగి ఉంది 


ఇదేం సృష్టో యేమో…

బ్రహ్మకింకా  నైపుణ్యం పెరగాల్సి ఉందనిపిస్తుంది 

మరి సరస్వతిని ప్రసన్నం చేసుకోమందామా?