ప్రభాతపు పలకరింపులో పెదవి మీది చిరునవ్వులో
ఏకాంతపు మౌనంలో నిశీధి నిశ్శబ్దం లో
కంటిచుక్కని జార నివ్వని చేతి స్పర్శలో
తప్పొప్పుల ఎంపికల మందలింపులో
కలలారని కనుపాపపై చిత్తరువై
మౌనాన్ని చదవగలిగే మది భాషవై
ఓటమి బాధలో ఊరడింపువై
విజయపు ఆనందం లో మృదుస్పర్శవై
క్షణ క్షణమూ నా పరవశానివై
గమ్యం చూపే మార్గానివై
నా ప్రతి అడుగులోని సాహసానివై
భయమంటే తెలియని నా ధైర్యానివై
ఊహవై నా ఊపిరివై శ్వాస వై నా సర్వం నువ్వై
అనుక్షణం నా తోడుగా నీడగా ఉన్న నీ పేరు స్నేహమేగా?







0 comments:
Post a Comment