చందమామ చందనాలు పంచుతున్న వేళలో
తొలి వెన్నెల కిరణం నా హృదయం
చేరెనే
మల్లె మొగ్గ మరువపు రెమ్మ జతకట్టిన
వేళలో
తొలి పరిమళం నా మనసుకు తాకెనే
నా కన్నుల కాంతుల్లో తొలి వెలుగు
నీవులే
నా ఆశల పందిరిలో తోలి అడుగు నీదిలే
నా ఆధరాల దరహాసం తుదికంటా నీవేలే
నా హృదయాన మధుమాసం నీ తోడుగానే
నా ఎదలోని మంత్రం నీ నామధ్యానం
నా దరిరారు ఎవరూ నీ సన్నిధి లోన
నిడురన్నది నను చేరనంటున్నది
రెప్పవాల్చితే నీ రూపు కరుగుతుందని
మరచి పోయానులే నాకంటూ ఓ మనసుందని
తెలుసుకున్నానులే అది నీకు జతగా
చేరిందని
నా భావనలో నీవు నేను ఒకటై అంబర
వీధిలో తేలియాడగా
నా తలపులలో నీ రూపే నిండి తొలిప్రేమనే జనియింపగా
కలలో నైనా ఎడబాటెరుగక నిన్ను తలుస్తూ
నా మనసుతో నీ ఊహలే ఊసులాడుతుండగా
నా వడిలో నీ వలపులనే బంధించగా
ఉదయం మొదలు సాయం సంధ్య వరకూ
ఎచ్చట చూసినా నీవే ఇంకేవీ కానరావే











