చిట్టి బిందె చంకన పెట్టి
మూరెడు మల్లెలు తల్లో చుట్టి
కాలి అందెలు సవ్వడి చేయగా
వెన్నెల ఝామున వెండి బొమ్మలా ఏటి కెలుతుంటే
గుప్పెడు మనసున వలపులు రేగి
గుండెల్లో... నా గుండెల్లో మోగాయి కళ్యాణ రాగాలు
కాబోయే... కాబోయే మా పెళ్ళికవి సన్నాయి మేళాలు
పండువెన్నెల వెలుగుల్లో వెండి బొమ్మ తన రూపం
ప్రేమకాంతి చిగురించే ప్రణయ దీపమే తన నయనం
కోనసీమ గుండెల్లో గోదారి పరవళ్ళు తన కురులు
అరవిరసిన మల్లియలే తన నవ్వుల సిరులుసందె చుక్క వెలిగే వేళలో దివ్యరాగం తానులే
ఉదయించే ప్రతికిరణం తనకోసమే వెదికేను
ఆ నీలాకాశం లో నిండుగ జాబిలి తానేలే
ఆ తళుకుల తారకలే తన చెలికత్తెలులే
దాచాడు ఆ బ్రహ్మ పసిడి నిక్షేపాలు తన చెక్కిళ్ళలోనే
తన కంటి నీరు నా గుండె కార్చు
తన చిరునవ్వుతోనే నా మనసున వెలుగు
నా కంటిపాపల్లోని తన రూపం
నాలోని ప్రేమకి రక్షణ కవచం
చీకటే దరి చేరదు నా తోడు తానుండగా
జాబిలికన్నా చల్లనిది తన వడి
మమతలు నిండిన చక్కని గుడి తన హృది
రెప్పపాటు క్షణమైనా తానులేక నాకు బతుకు లేదులే
చిన్ననాటి కలలో కూడా నా రాణి తానేలే
క్షణమైనా ఆగని నా హృదయానికి ఊపిరి నాలోని తన
రూపమే 





0 comments:
Post a Comment