1.
ఇంకా ఎవరిచే తెరవబడని నిశ్శబ్దాన్ని
తొలిచే ఒక సమయంలోకి
కొన్ని సమయాలు తమని తాము
నిలువు దోపిడీ చేసుకుంటున్నాయి
తవ్వుకున్నంత మేరా
నిశ్శబ్దం చేస్తున్న శబ్దాన్ని
తాగుతున్న
ముద్రికలేవో
మత్తుగా సోలిపోతున్నాయి
లలితమైన కంపనేదో
తీపి నేరంలోకి తోసినట్లుగా
2.
ఈ నేల
నీ మీదుగా మూసుకుని పోతున్నప్పుడు
నీ కన్నీటి బొట్టు ఒకటి ఘనీభవించి
చరిత పుటల్లో వెల్లడైతే
అది చెప్పే
ఒక్క కథే
రేపటి ప్రపంచపు జీవ రహస్యం
నిన్ను మళ్ళీ నేలపై మొలకెత్తించే
బ్రహ్మత్వం







0 comments:
Post a Comment