తీరాన్ని తడిమేస్తున్న
పాద ముద్రల కౌగిలి కోసం
ఎగసి పడుతున్న అలల సవ్వడిని
తన గుండెల్లో శీతలీకరించుకుంటూ
వాన వాకిట్లో
ఆర్తిగా తనని తడుపుకుంటున్న
సముద్రాన్ని చూడు…
తన ఉప్పదనాన్ని
తియ్యగా మార్చి
తన దాహం తీర్చే
ఒక్క చినుకు కోసం
యుగాలుగా ఎదురు చూస్తూ
కడలి గానే కాదు…
కన్నీటిగానూ మారి
లోకమంతా విస్తరించినట్లు లేదూ…!







0 comments:
Post a Comment