Thursday, 10 August 2017
Sunday, 11 June 2017
The Touch
Do you hear her?
All the time she is telling your story
Whole day she is waiting for you
And tries to exhaust your tiredness
Without moving from where she stood,
She listens to you throughout your daily life
And the world's stories
She hides your secrets from the world
She is the witness for your generations
And gathered breaths of your parents
She kisses your childish foot
And Afterwards,
Witnessed when you become steps for your child’s foot
And she is the witness of your life with your sweetheart
She becomes wet for your tears
And joy of your smiles
She shows you like a mirror
And becomes address for your existence
She conceals you from the world's exasperations
And she is with you even in destruction
Look at her and listen to her
She is craving for a whole-hearted touch
Now, do you hear her?
Yes, true…
She is… Your room
Now… Give affectionate,
Warm touches to her
And then, you can hear
Splashes of holy souls
That enlighten your life
All the time she is telling your story
Whole day she is waiting for you
And tries to exhaust your tiredness
Without moving from where she stood,
She listens to you throughout your daily life
And the world's stories
She hides your secrets from the world
She is the witness for your generations
And gathered breaths of your parents
She kisses your childish foot
And Afterwards,
Witnessed when you become steps for your child’s foot
And she is the witness of your life with your sweetheart
She becomes wet for your tears
And joy of your smiles
She shows you like a mirror
And becomes address for your existence
She conceals you from the world's exasperations
And she is with you even in destruction
Look at her and listen to her
She is craving for a whole-hearted touch
Now, do you hear her?
Yes, true…
She is… Your room
Now… Give affectionate,
Warm touches to her
And then, you can hear
Splashes of holy souls
That enlighten your life
Tuesday, 6 June 2017
గ్రామీణం
గాలి పంజరంలో చిక్కుకున్న
నిశ్చల… నీరవ… నిశ్శబ్దం!
నగిషీలు చెక్కబడ్డ హిమ ధ్వనిలో
పేరుకుపోతున్న నిరీక్షణ
ఓ యాత్రికుడా...
ఇది నువ్వు రావాల్సిన సమయం
ఈ చిన్ని దీపాన్ని కాపు కాస్తున్న
చిక్కటి చీకటికి విశ్రాంతినిచ్చే
విద్యుత్తరంగమై
రూపాంతరం చెందే సకలానివై
ఓ యాత్రికుడా...
ఇది నువ్వు రావాల్సిన సమయం
మహా మౌన స్థితిలో గడ్డకట్టిపోతున్న
చల్లని ధ్వనిని
గోరు వెచ్చగా మేల్కొలిపే గ్రామీణానివై
కాలాన్ని ఆకుపచ్చగా శ్వాసించే
స్వచ్ఛతార్ణవమైన
మిత్రత్వాన్ని లిఖించాల్సిన పొద్దు ఇది
కంటి రెప్పపై వానబరువునంతా
సీతాకోకచిలుక రెక్కలపైకి
తేలికగా తర్జుమా చేసే
ఏకాంతపు కుంచె చివరి
నిర్దోషమైన రేఖవై
నిన్ను నిజం చేసుకోవాల్సిన తరుణంFriday, 26 May 2017
Wednesday, 10 May 2017
అలమారలో సర్దేస్తాం కానీ
నీటి చెలమలని నింపుకున్న…
చెమటని తెంపుకున్న…
రక్తమోడుతున్న...
వాదవివాదాలని చర్చిస్తున్న
ఆదర్శాలని నిద్రపోనివ్వని
అక్షరాల మధ్యలో నుండి జారిపోతున్న
పాత్రలని అనునయిస్తూ
'మీరెంతగా కదిలించినా
ముగింపుని దాటేసాక
పొందికగా అలమారలో సర్దేస్తాం కానీ
మేమంటూ కదిలిపోయేటంత
మనసు నగ్నత్వం మాలో లేదంటూ
ఇది కథేలే
మీకు ఇదే శాశ్వతనివాసం '
అని చెప్పి వచ్చేద్దాం
రా మరి...
ఈ ఒక్క కథలోకీ వెళ్లివద్దాం!Monday, 8 May 2017
మన రాతలకి మనమే...
మనమొక వార్తగా మారాలంటే ఈ రోజు ప్రధానవార్తని మన హస్తగతం చేసుకోవాలి. అభినందనో… విమర్శో అతి తీవ్రంగా ఉండాలి. అది వ్యక్తిత్వ సరిహద్దుల్ని దాటిపోవాలి.
ఇదే కదా నేటి సమాజ పోకడ.
ఈ సమాజంలో భాగస్వాములుగా ప్రతి విషయం మీద ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉండాలి. మన అభిప్రాయాలని మనం వెలిబుచ్చే హక్కు మనకు ఉంది. అవును నిజమే. మనకి హక్కులున్నాయ్. ఉండాలి కూడా. మన రాతలకి మనమే సంపాదకులం . అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే లేనిపోని అసమానతలకి దారి తీసిన వారిమే అవుతాం. ఉన్న సమస్యలకి తో కొత్త సమస్యలు సృష్టించిన వారిమే అవుతాం.
నేటి తాజా వార్త కోసం లేని కోడిగుడ్డు మీద ఈకలు ఉన్నట్లుగా కొందరు… వాటిని పీకటానికి సిద్ధంగా మరికొందరు. అందుకోసం ప్రపంచంలోని ప్రతి సమస్య మీద మనకు సంపూర్ణ అవగాహన ఉన్నట్లుగానే నటించేస్తూ ఉండాలి. లేదంటే మన మేథావితనం పలచబడిపోతుంది.
నిజానికి ప్రతి వార్తాసంస్థ నుండి వచ్చేది ఏదో ఒక పక్షం తీసుకుని వండి వార్చే వార్తలే… వాళ్ళ దృక్కోణం నుండి వాళ్ళు చేసే వాఖ్యానాలే మనం రాసే చాలా రాతలకి ఇన్ పుట్స్. సౌర్స్ లోనే లేని నిజాయితీ, వాటి మీద మనమెంత నిజాయితీగా మన వ్యాఖ్యానం సిద్ధం చేసినా విలువ సంతరించుకుంటుందా?
సమర్ధింపో… విమర్శో విషయమేదైనా సరే ఆవు వ్యాసంలా..; ఆ విషయంలోకి మనకి నచ్చిన వాడినో/ నచ్చని వాడినో తీసుకుని రావాల్సిందే. లేదంటే చెప్పాలనుకున్నది సరిగ్గా పండినట్లుగా అనిపించదు.
పనిగట్టుకుని చేసే పొగడ్త అయినా విమర్శ అయినా అది మనకి తెలియకుండానే యథార్థవాదానికి చాలా దూరంగా జరిగిపోతూ ఉంటుంది. మనుషుల్ని వ్యక్తిగత పొరపొచ్చాల వైపు నడపటం తప్ప వీటి వలన ఉపయోగం ఏమీ ఉండదు. నిజానికి ఏ విషయం పైన అయినా సమీక్ష జరగాలి. ఆ సమీక్ష లోనే ఆ విషయంలోని బలాలు, బలహీనతలు చెప్పబడాలి. అప్పుడే పొగడ్త… విమర్శ రెండూ ఒకే చోట ఇమిడి ఒక ఆరోగ్యవంతమైన చర్చకు దారితీస్తుంది. లేదంటే మనకి తెలియకుండానే (తెలిసి కూడాను) కొత్త వివాదాలకి దారి తీస్తుంది.
మనసులో నమ్మక పోయినా, మనకి ఇష్టం లేని వాడు చెప్పేవన్నీ పస లేని వని, మనకిష్టమైన వారు చెప్పేవన్నీ చాలా చక్కనివని ఒక ప్రచారంలోకి దిగిపోతున్నాం. మనం నమ్మినదాన్ని నమ్మని వాడిని మనకి అయిష్టుడిగా, సమర్ధించిన వాడిని ఆప్తుడిగా మార్చుకుంటున్నాం.
బాధాకరమైన విషయం ఏమిటంటే…
ఇలాంటి వాటికే ఒక అనుచరగణం తయారవుతుంది. చాలా చోట్ల ఏ విషయంలోనూ లోతుపాతులు అసలు తెలియకుండానే ఏదో ఒక పక్షం లో చేరిపోయి అప్పుడప్పుడే రాజుకుంటున్న నిప్పును మరింత ఎగదోస్తూ ఉంటారు. ఎవరి పక్షం ఎవరో తేల్చేది కులమో, మతమో, ప్రాంతమో, వర్గమో… మనం నమ్మే రాజకీయ పక్షమో తప్ప మనం నమ్మే సిద్ధాంత భావజాలం కాదు.
ఇన్నాళ్ళుగా నేర్చుకున్న విజ్ఞానమంతా పక్కకుపోయి, అప్రధానమైన విషయాలకోసం ఒక రణరంగాన్నే సిద్ధం చేసుకుంటున్నాం. పిచ్చి పిచ్చి విషయాల మీద మనం చేసుకునే వాగ్యుద్ధంలో మనం కోల్పోయేది మాత్రం మనమంటూ మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేని విలువ కట్టలేని సమయమే.
సిద్ధాంత వైరుధ్యాల మీద చర్చ జరగాలి కానీ వ్యక్తిగత లోపాల మీద కాదు. ఎప్పుడైతే చర్చ వ్యక్తిగతమవుతుందో, రెండు సిద్ధాంత వైరుధ్యాల గురించిన్ చర్చలో బయటకి వచ్చే ఎన్నో అమూల్యమైన వ్యక్తీకరణలు మృగ్యమవుతాయ్.
Sunday, 7 May 2017
ఆకు
చిరు కొమ్మ చివరన చిగురేసుకుని వచ్చినప్పుడు
కొంగ్రొత్త చిలకపచ్చదనపు మెరుపులో వళ్ళు విరిచింది
యవ్వనం యక్ష గానం చేస్తున్నప్పుడు
గాలి చేస్తున్న గాంధర్వానికి మైమరపుతో తాళం వేసింది
ఎండ బారిన మనిషి మేనిపై
నీడల దడితో శుశ్రూష చేసింది
చెట్టుకి తాను మోయలేని బరువనుకున్నప్పుడు
మౌనాన్ని శబ్దిస్తూ రెప్పపాటులో రాలిపోయింది
ప్రకృతికి సారవంతమైన నేలని కానుకిస్తూ
కుళ్ళిన తనువుతో
తపమొనర్చుతూ మట్టిలోకి మాయమయ్యింది
ఆత్మార్పణ వేళ ఎప్పుడో
జీవితాన్ని వెలిగించుకోవటమంటే ఏమిటో
పంచ భూతాలూ పచ్చగా నవ్వినప్పుడే తెలిసింది
Saturday, 6 May 2017
శబ్దం
నేనేం చదివానో
నేనేం చెప్పానో చూసి
నన్ను వెల్లడి చెయ్యడం
సులువనుకోవటంలో
నీ తప్పేమీలేదు...
నీ దాకా వస్తే నేనైనా అంతేమరి
మనవైన అవగాహనలన్నీ
మనకున్న అభావనలన్నీ
మన ఆంతరంగిక మిత్రులు కదా
మరి...మన మాటలోనే సాగుతాయిలే
నేను నేర్చుకున్నదేదో
యే రూపుగా యే వేళలో
తాను బయల్పడటం మొదలవుతుందో
ఇంకా నాకు ఎరుకపరచలేదు
యే పచ్చి మట్టి వాసనలో
మరే పచ్చడి అన్నం ముద్దలోనో
ఒక శబ్దాన్ని కూరిన పరావర్తనమై
లోకాన్ని నిస్సిగ్గుగా పలకరించే
ఆ ఒక్క సమయం కోసం
కాసిని ఎదురు చూపులు రాసే ఉంచా 

















