తేమ గాలి ఒకటి
లోకాన్ని ఊడ్చుకుంటూ వెళుతుంది
బహుశా...
వాన వచ్చేలా ఉన్నట్లుంది
లోకమంతా పొడి నేలకై పరిగెడుతుంటే
ఇదిగో ఈ కిటికీ మాత్రం
ఎప్పటిలా
నీటి చిత్రాలకి కాన్వాస్ గా
మారటానికి
అటూ ఇటూ తలని ఊపేస్తుంది
నాలా… తనూ పిచ్చిదే మరి
గాజు మెరపుల
నీటి చిత్రాలెప్పటికీ శాశ్వతమనుకుంటూ
తడి కోసం తపన పడుతూ
3 comments:
ఎంత బాగ రాసారండి... సూపర్బ్.
Good Post.
latest Telugu Dubbed Movies
ఎత్తుగడ ఎంత బాగుందో! తపన ఇంకాస్త పెరగాలి సుమా ... :)
Post a Comment