Saturday, 6 May 2017

శబ్దం

నేనేం చదివానో
నేనేం చెప్పానో చూసి
నన్ను వెల్లడి చెయ్యడం
సులువనుకోవటంలో
నీ తప్పేమీలేదు...
నీ దాకా వస్తే నేనైనా అంతేమరి

మనవైన అవగాహనలన్నీ
మనకున్న అభావనలన్నీ
మన ఆంతరంగిక మిత్రులు కదా
మరి...మన మాటలోనే సాగుతాయిలే

నేను నేర్చుకున్నదేదో
యే రూపుగా యే వేళలో
తాను బయల్పడటం మొదలవుతుందో  
ఇంకా నాకు ఎరుకపరచలేదు

యే పచ్చి మట్టి వాసనలో
మరే పచ్చడి అన్నం ముద్దలోనో
ఒక శబ్దాన్ని కూరిన పరావర్తనమై  
లోకాన్ని నిస్సిగ్గుగా పలకరించే
ఆ ఒక్క సమయం కోసం
కాసిని ఎదురు చూపులు రాసే ఉంచా


3 comments:

Nicely written.... with subtle meaning

చాలా బావుంది కానీ లాస్ట్ స్టాంజా సరిగా అర్థమైందో లేదో అన్నట్లుగా ఉంది. మీరు ఏ ని యే అని రాయడం ఇప్పుడే చూస్తున్నాను.

మనల్ని చదివి అర్థం చేసుకునే మనసును గెలుచుకోవడమే మన జీవితార్థం
అది ఏ రూపంలో ఏ వేళలో మనకు తారసపడినా....

Post a Comment