లోపలెవరో
కదులుతున్న సవ్వడి
స్తంభించిన పుప్పొడిలా
ఏదో దీర్ఘ ధ్యానం
తడచిన చీకటి గుండా
వెలుగు రథాన్ని
తోలుకొస్తున్నట్లు
చిన్న నవ్వు
గాలికింత మత్తును
రాసి పంపినట్లు
వెదురు వేణువుని స్పృశిస్తూ
ఓ అపురూప మైకం !
మౌనం నిండా
ఎన్ని అవ్యక్తపు కొలతలో
ప్రకృతి రాసే పద చిత్రాలని
అనుభూతుల త్రాసులో తూకమేస్తూ
నిజమే…
ఈ మౌనమింతే
తనని తెరచినప్పుడల్లా
దృశ్యాదృశ్యాల మార్మిక స్పర్శ
ఒక సుదీర్ఘ మౌనం...
మనసుని
విపులీకరించే భావ నిఘంటువు
పదానికో కొత్త అర్థాన్ని లిఖిస్తూ







1 comments:
Superb Expression! You are trying to turn every one like you :)
Post a Comment