గుడికెళ్ళినా బడికెళ్ళినా వేడుకైనా వేదికైనా ప్రముఖులంటూ మెహార్బానీ చేస్తూ… సామాన్యుడి సమయాలకి ఎదురుచూపుల కళ్ళెమేసే రాచ బానిసల కార్యశీలతలో మాన్యుడు సామాన్యుడిలో కలిసేదెక్కడ?
భుజాల మీద చేతువేసి తట్టగానే జీవితమే ధన్యమయ్యిందనుకునే అమాయక జీవాలకి,
ఉరుకుల పరుగుల జీవన యానంలో మనిషి మనిషియొక్క ప్రతి క్షణానికీ విలువ ఉందని తెలిసీ , ప్రముఖుల కోసమంటూ రహదారులని దిగ్బంధం చేసే అధికారం రోడ్డంతా పరిగెడుతూనే ఉంది. అడుగు పెట్టిన ప్రతి చోటా VIPలంటూ ప్రత్యేక హోదా ఇచ్చేస్తుంటే మా సమయాలకి విలువెక్కడ?
కార్ల మీద బుగ్గలు తీసెయ్యగానే సామాన్యులు మాన్యులైపోతారా ఏం. మాకు మీరనే VIPహోదా వద్దులే ఆర్యా! మనిషన్న హోదా మిగిల్చితే చాలు.
ప్రజాస్వామ్య దేశంలో బుగ్గ కార్లకే కాదు… ‘బుగ్గ’ మనస్తత్వాలకీ మంగళం పాడి చూపించండి






0 comments:
Post a Comment