నల్లని రాత్రిని మూసేస్తూ
సూర్యుణ్ణి తెరచిన కాంతి ద్వారం
ఆకాశాన్ని మరింత స్పష్టపరిచే
కథని చూస్తున్న కళ్ళ వైపుగా
శూన్యాన్ని మూసేసుకున్న రాజసాలుగా
నడిచే అడుగుల కోసం
ఎన్నాళ్ళైనా ఎదురుచూపులు సాగాల్సిందే
మరో చోటకి వలస పోయే చూపుల్లోని పొడిదనంలో
తనకు పనిలేదంటూ
ఎప్పటికప్పుడు
కళ్ళని శుభ్రం చేసుకుంటున్న నిరీక్షణలకి
చేరువ కావడమన్నది
లోలోన గూడు కట్టుకున్న
ఉద్వేగాలని వెలికితియ్యడమే
తడి కొరడాతో
మనసుని ఈడ్చి కొడుతున్న కళ్ళలోకి
సూటిగా చూసేంత
స్వచ్ఛతని రాసుకున్న చూపులు కొన్నైనా దాచుకుందాం
లేదంటే...
నిలువెత్తు దాహాలుగా ఆవిరవుతాం
ఎడారి వాసనలుగా వీయబడతాం







1 comments:
మెదడుకు మేతలా నా బుర్రకి మీరింత పని చెప్తూ ఉంటే ఎలా...
Post a Comment