అక్షరం రాయబడని కాగితంపై
పరుచుకున్న మనసుని చదువుతున్న తనని చూసి
విషాదం విరిగిపోతున్న చప్పుడు కరిగించేస్తున్న
నిశ్శబ్దంలో నుండి
గుండె కిందగా
ఒక నవ్వు మొదలవుతున్న సవ్వడి వినగానే
ఇందాక
తెల్లకాగితంపై రాలిపడ్డ
రెండు కన్నీటి చుక్కలు
ఇప్పుడు నవ్వుల చిగుర్లు వేసుకుంటూ
తడి తడిగా మనసుని అల్లుకుంటున్నాయి
కంటి నిండుగా వెన్నెల పూలని పుష్పిస్తూ 






1 comments:
భలే! సూపర్ థాట్... లవ్ ఇట్! ❤
Post a Comment